క్రిష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమాపై పవన్ అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే పవన్ తన కెరియర్ లోనే మొదటిసారిగా హిస్టారికల్ నేపథ్యంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి లీకైనా ఫోటోస్ లో పవన్ గెటప్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.. ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు "హరిహర వీరమల్లు" అనే టైటిల్ పరిశీలనలో ఉంది.