ప్రస్తుతం తన కెరియర్ లో ఎప్పుడు లేని విధంగా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఆయన కాస్తా గ్లామర్‌పై కూడా దృష్టి పెట్టాడు. ఈ నేపథ్యంలో పవన్ న్యూ లుక్ ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. క్లీన్ షేవ్‌తో స్లీమ్‌గా మునుపటి పవర్ స్టార్ల దర్శనమివ్వడంతో అభిమానులంతా సర్ప్రైజ్ అవుతున్నారు. ఈ ఫొటోలో పవన్ బ్లాక్ ట్రౌజర్-టీ షర్ట్‌తో నడుముపై చేతులు పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తు దర్శనం ఇచ్చాడు. ఇలా స్టైలిష్ లుక్ వపన్‌ను చూసి ఫ్యాన్స్ అంతా ఫిదా అవుతున్నారు. ‘పవర్ స్టార్ ఈజ్ బ్యాక్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.