అర్జీవి ట్విట్టర్ లో శివుడి రూపంలో ఉన్న తన ఫోటోలను షేర్ చేస్తూ " మీ అందరికీ చాలా సంతోషంగా లేని శివరాత్రి శుభాకాంక్షలు! ఈ క్రింది చిత్రం మీరు ద్వేషించేవారిని గుర్తు చేస్తే, ఇది యాదృచ్చికంగా జరిగింది. శివుడిని అభినందించండి! " అంటూ రాసుకొచ్చాడు..అలాగే కొంత సేపటి తరువాత మరొక పోటో షేర్ చేస్తూ " శివ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఎవరికైనా తెలిస్తే, దయచేసి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ను సంప్రదించండి " అంటూ ట్వీట్ చేశాడు.. దీంతో అర్జీవి పై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. " ఇది పిచ్చికి పరాకాష్ట అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికి శివుడి రూపంలో ఉన్న రామ్ గోపాల్ వర్మ ఫోటోస్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.