ఈ సినిమాలో ఉండే ప్రతీ ఒక్క యాక్షన్ సీక్వెన్స్ ను కూడా చాలా రఫ్ అండ్ రియలిస్టిక్ గా ప్లాన్ చేస్తున్నారట. ఇదే విషయాన్ని ఈ సినిమాకు పని చేసిన ఓ యువ స్టంట్ కొరియోగ్రాఫర్ చెప్పాడు. కేవలం తనకి ఇచ్చిన సీక్వెన్స్ మాత్రమే కాకుండా మిగతా ఫైట్ మాస్టర్స్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఓ రేంజ్ ఉంటాయని తెలిపాడు. అల్లు అర్జున్ ఇంతవరకు తన కెరియర్ లో ఎప్పుడు చెయ్యని విధంగా చాలా సహజత్వానికి దగ్గరగా ఫైట్స్ చేశాడని, కచ్చితంగా ఈ సినిమాతో అల్లు అర్జున్ లోని మరో కోణాన్ని చూస్తారని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. దీంతో పుష్ప లో యాక్షన్ అండ్ మాస్ ఎలిమెంట్స్ సుకుమార్ గట్టిగానే దట్టిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.