రేపు విడుదల కాబోతున్న ‘మామ మంచు అల్లుడు కంచు’ సినిమా ప్రమోషన్ గురించి ఈరోజు ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ ఈసినిమాకు సంబంధించిన అనేక విషయాలు షేర్ చేస్తూ తన కెరియర్ మొదటి రోజులలో తనను డిప్రెషన్ కు గురిచేసిన ఒక దర్శకుడి మాటలను గుర్తుకు చేసుకున్నాడు. తాను 50 సినిమాలు పూర్తి చేసిన నేపధ్యంలో ఈమాటలు అన్నాడు ఈ అల్లరోడు. 

తాను తన కెరియర్ కు సంబంధించి 50 సినిమాలలో నటిస్తానని కలలో కూడ అనుకోలేదని దీనికి కారణం తాను నటించిన ‘అల్లరి’ సినిమా ప్రారంభానికి ముందు ఒక ప్రముఖ దర్శకుడి వద్దకు వెళ్ళి తనకు అతడు తీయబోయే సినిమాలో ఒక పాత్ర ఇమ్మని అడిగితే ఆ దర్శకుడు ఏ మాత్రం మొహమాట పడకుండా ‘నీ మొహం అద్దంలో చూసుకున్నావా’ అంటూ తన పై సెటైర్లు వేయడమే కాకుండా నీకన్నా నీ అన్న అందంగా ఉంటాడు అని కామెంట్స్ చేస్తూ దర్శకుడుగానో నిర్మతగానో మారకుండా ఈసినిమాల పిచ్చి ఏమిటి అని కామెంట్ చేసిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు.

అంతేకాదు ‘మీ నాన్నకు డబ్బు ఉంది కదా నువ్వు అమెరికా వెళ్ళిపో’ అని ఉచిత సలహాలు కూడ ఇచ్చాడని అంటూ అలనాటి విషయాలను గుర్తుకు చేసుకున్నాడు అల్లరి నరేష్. తన తండ్రి జీవించి ఉన్న కాలంలో తనతో సినిమాలు చేసేవారు కాబట్టి తన కెరియర్ బ్యాలెన్సింగ్ గా ఉండేదని ప్రస్తుతం తన తండ్రి లేకపోవడంతో తన ఫెయిల్యూర్స్ ఫోకస్ అవుతున్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు అల్లరి నరేష్. 

ఇక తాను నటిస్తున్న ‘మామ మంచు అల్లుడు కంచు’ సినిమా విషయాలను చెపుతూ తనకు చాలామంది మోహన్ బాబుతో కలిసి నటించడం చాల కష్టం అని చెప్పారని దీనితో మొదట్లో ఆయన ఎదురుగుండా భయంభయంగా నటిస్తే తన భయాన్ని గ్రహించిన మోహన్ బాబు ఆత్మీయంగా మాట్లాడుతూ ‘నీకు సౌకర్యవంతంగా ఎలా అనిపిస్తే అలా నటించు నా విషయం మరిచిపో’ అని చెపుతూ తనను విపరీతంగా ప్రోత్సహించారని మోహన్ బాబు పై ప్రశంసలు కురిపించాడు అల్లరి నరేష్. ప్రస్తుత తరం ప్రేక్షకులు తమకు ఏడ్చే ఓపిక లేదు అని అనేక సార్లు సంకేతాలు ఇస్తున్న నేపధ్యంలో కామెడీ సినిమాలకు ఎప్పుడూ మార్కెట్ ఉంటుంది అని అంటూ రాజేంద్రప్రసాద్ లా తనకు ఒక స్థానం ఉంది అని చెపుతున్నాడు అల్లరి నరేష్..



మరింత సమాచారం తెలుసుకోండి: