అందాల హీరోయిన్ అనుష్క త్వరలో పెళ్లి కుమార్తె కానుంది. ‘సూపర్’ తో పరిచయమయ్యి ‘అరుంధతి’ సినిమాతో తెలుగు చిత్ర సీమ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బెంగుళూరు బ్యూటీ అనుష్క త్వరలోనే పెళ్ళి పీటలు ఎక్కనుంది. హైదరాబాద్ కు చెందిన ఒక వ్యాపార వేత్తతో అనుష్క కు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తుంది. త్వరలో అనుష్క వివాహం జరగునుంది.
టైటిల్ పాత్రలో అనుష్క నటిస్తున్న ‘రాణీ రుద్రమదేవి’ సినిమా ఇటీవలే షూటింగ్ ప్రారంభమయ్యింది. అలాగే రాజమౌళి దర్శకత్వంలో అనుష్క నటించే ‘బహుబలి’ సినిమా ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. ఈ రెండు సినిమాల విడుదలకు ముందే అనుష్క వివాహం జరగనుంది.
అయితే ఆడంభరాలకు దూరంగా వివాహం చేసుకోవాలని అనుష్క భావిస్తున్నట్లు సమాచారం. వివాహం అయిన తరువాత జయసుధ, ఐశ్వర్యరాయ్.. వంటి వారు చిత్రసీమలో రాణిస్తున్నారు. అనుష్క కూడా వీరి బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: