యంగ్ అప్‌కమింగ్ హీరో విశ్వక్సేన్ కొత్త చిత్రం `కార్టూన్` లాంఛనంగా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా ప్రదీప్ పులివర్తి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డిఫరెంట్ జోనర్లో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జూన్ 3 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
రధన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఉదయ్ గుర్రాల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆర్యక్రియేటివ్స్ బ్యానర్‌పై విశ్వనాథ్ మల్లిడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నటీనటులు:విశ్వక్ సేన్సాంకేతిక వర్గం:రచన, దర్శకత్వం: ప్రదీప్ పులివర్తినిర్మాత: విశ్వనాథ్ మల్లిడిబ్యానర్: ఆర్య క్రియేటివ్స్ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నందూరి శ్రీనివాస్ కౌశిక్మ్యూజిక్: రధన్సినిమాటోగ్రఫీ: ఉదయ్ గుర్రాలప్రొడక్షన్ డిజైనర్: లతా తరుణ్పాటలు: రాకేందు మౌళిలైన్ ప్రొడ్యూసర్: సాయికృష్ణ గద్వాల్