ఓ వైపు రొమాంటిక్ యాంగిల్ మరోవైపు యాక్షన్ మూడ్. యంగ్ హీరో నితిన్ ఒకేసారి రెండు షేడ్స్ ని రివీల్ చేశాడు. అమ్మాయి వెంట రోమియోలా పడతాడు. అల్లరి మూకల ఆటకడుతాడు. ఏంటి ఇది అనుకుంటున్నారా.. నితిన్ న్యూ మూవీ భీష్మకు సంబంధించి న్యూ పోస్టర్స్ లో బ్రీఫ్ గా క్లూ ఇచ్చాడు. 


హ్యాట్రిక్ ఫ్లాప్స్ తో యంగ్ హీరో నితిన్ రేసులో వెనుకపడ్డాడు. కెరీర్ కే బూస్టింగ్ ఇస్తాయనుకున్న లై, ఛల్ మోహనరంగా, శ్రీనివాస కళ్యాణం సినిమాలు నితిన్ కు చేదునే మిగిల్చాయి. వరుస ఫ్లాప్స్ కాస్త గ్యాప్ తీసుకున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం దర్శకుడు వెంకీ కుడుమల దర్శకత్వంలో భీష్మ సినిమాలో నటిస్తున్నాడు. 


భీష్మ.. సింగిల్ ఫల్ ఎవ్వర్ అనేది ట్యాక్ లైన్. కానీ పోస్టర్స్ చూస్తుంటే ట్యాగ్ లైన్ కు పూర్తి రివర్స్ లో ఉండటం విశేషం. ఇదే సినిమాపై క్యూరియాసిటిని పెంచుతోంది. ఏదో లాజిక్ ఇంకేదో మ్యాజిక్ సినిమాలో ఉండబోతుందనే దర్శకుడు పోస్టర్స్ తో హింట్ ఇస్తున్నాడు. కొత్త పోస్టర్స్ లో భీష్మలోని రొమాంటిక్ యాంగిల్ తో పాటు యాక్షన్ మూడ్ ని కూడా ఒకేసారి రివీల్ చేసే సినిమాపై అంచనాలు పెంచుతున్నాడు. ఎప్పటిలాగే రష్మిక పోస్టర్ లో క్యూట్ లుక్స్ తో ఇంప్రెస్ చేస్తోంది. 


పోస్టర్ లో రష్మిక పాత్రను గమనిస్తే గీత గోవిందం సినిమాలోని గీత పాత్రకు ఎక్స్ టెన్షన్ లానే కనిపిస్తోంది. ఆ బిల్డప్పు.. చారెడేసి కళ్లు.. బుంగమూతితో రష్మిక యూత్ కిక్ కనిపిస్తోంది. ఛలో లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై నితిన్ బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ఇక డియర్ కామ్రేడ్ ఫ్లాప్ తర్వాత రష్మిక భీష్మ సక్సెస్ ఇస్తోందనే నమ్మకం పెట్టుకుంది. సక్సెస్ హోప్స్ మోసుకొస్తున్న భీష్మ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ రాబడుతాడో చూడాలి. 







మరింత సమాచారం తెలుసుకోండి: