ఆ మద్య ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో సినీ తారలతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని మోదీ ఇంట జరిగిన ఆ కార్యక్రమంలో దక్షిణాది నుంచి పెద్దగా ప్రాతినిథ్యం కనిపించకపోవడం పై అటు సినీ తారలు, ఇటు రాజకీయ పరంగా విమర్శలు వెల్లువెత్తాయి.  కేవలం బాలీవుడ్ కి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం ఎంత వరకు సమంజసం..భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దక్షిణాది చిత్ర పరిశ్రమలు కూడా దోహదం చేస్తున్నాయని పలువురు కేంద్రం వైఖరిని విమర్శకులు ప్రశ్నించారు. 

ఈ నేపథ్యంలో రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఉపాసన కూడా మోదీని విమర్శించారు.  దాంతో అటు మెగాఫ్యామిలీ..ఇటీ సినీ సెలబ్రెటీలు ఒక్కసారే షాక్ కి గురయ్యారు.  ఈ సందేశం రామ్ చరణ్ కి కూడా తెలియకపోవడం గమనార్హం.  ఏది ఏమైనా ఉపాసన చేసిన మెసేజ్ అందరినీ ఆలోచింపజేసింది. మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ లను ప్రధాని మోదీ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ తండ్రీతనయులు ఢిల్లీ వెళుతున్నారు.  ఇక అక్టోబర్ 2న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. 

మూవీ తెలుగు, కన్నడ, మళియాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు.  బ్రిటీష్ సైన్యాన్ని ఎదిరించి నిలిచిన మొదటి తెలుగు బిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కించారు. ఇటీవల ఈ మూవీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వీక్షించిన విషయం తెలిసిందే.   కాగా, తండ్రితో కలిసి ఢిల్లీ వెళుతున్నానని రామ్ చరణ్ ఓ జాతీయ మీడియా సంస్థకు తెలిపినట్టు సమాచారం. ప్రస్తుత ఎన్నికల హడావుడి కాస్త తగ్గిన తర్వాత వెళ్లాలనుకుంటున్నామని చరణ్ చెప్పినట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: