ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా పరిచయం అయిన కార్తికేయ సినిమా సినిమాకు నటుడి గా మంచి పేరు దక్కించుకుంటున్నాడు. ఈ సినిమా కంటే ముందే ప్రేమతో మీ కార్తీక్ అనే సినిమాలో నటించినప్పటికి ఆ సినిమా ఎవరికి తెలియకుండానే మూలనపడింది. అయితే ఆర్ఎక్స్ 100 మాత్రం టాలీవుడ్ లో మంచి ఇమేజ్ ని క్రియోట్ చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికి హీరోగానే సినిమాలు చేయాలని మడి కట్టుకుని కూర్చోకుండా కెరీర్ లో ముందుకు సాగాలనే ఉద్దేశ్యంతో విలన్ పాత్రలు చేసేందుకు కూడా ఈయన ఓకే చెబుతున్నాడు. ఇప్పటికే నాని హీరోగా నటించిన 'నాని గ్యాంగ్ లీడర్' సినిమాలో నెగటివ్ పాత్రను చేసిన కార్తికేయ మరో వైపు హీరోగా కూడా సినిమాలు చేస్తూ ఉన్నాడు.

 

ఇటీవలే కార్తికేయ నటించిన 90ఎంఎల్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో కార్తికేయ నటనకు విమర్శలకు నుండి ప్రశంసలు దక్కాయి. ఇదే సమయంలో కార్తికేయకు తమిళ సినిమాలో అది కూడా స్టార్ హీరో అజిత్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందట. అజిత్ హీరోగా ఖాకీ ఫేం హెచ్ వినోద్ దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కబోతుంది. విభిన్నమైన కాన్సెప్ట్ తో అజిత్ ను చాలా కొత్తగా దర్శకుడు వినోద్ ఈ సినిమాలో ప్రెజెంట్ చేస్తాడని తమిళ మీడియాలో ఈ సినిమాపై రక రకాల కథనాలు వస్తున్నాయి.

 

కోలీవుడ్ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి ఈ సినిమాలో పలువురు స్టార్స్ విలన్స్ గా కనిపించబోతున్నారట. అందులో ఒక విలన్ కార్తికేయ అంటూ సమాచారం. హీరోగా నటించడం కంటే విలన్ గా నటించడం వల్ల నటుడిగా నిరూపించుకునే అవకాశం ఉంటుందని.. అందుకే కార్తికేయ మరోసారి తన నటనను నిరూపించుకునేందుకు ఈ సినిమాలో చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరి కార్తికేయ ఈ వార్తలపై ఎలా స్పందిస్తాడో చూడాలి. ఏదేమైనా హీరోగా సెటిలవ్వాల్సిన కార్తికేయను అందరు కలిసి విలన్ చేసేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: