సల్మాన్‌ఖాన్ హీరోగా సల్మాన్‌ఖాన్ ఫిలింస్, అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్, సఫ్రాన్ బ్రాడ్కాస్ట్ మీడియా లి. పతాకాలపై సల్మాన్‌ఖాన్, అర్బాజ్‌ఖాన్, నిఖిల్ ద్వివేది నిర్మిస్తోన్న చిత్రం `దబాంగ్ 3`. ప్రభుదేవా దర్శకుడు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న సినిమా విడుదలవుతుంది. ఈ చిత్రాన్ని తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేస్తుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే.
బాలీవుడ్లో బాక్సాఫీస్ వద్ద వరుసగా సంచలన విజయాల్ని సొంతం చేసుకుంటున్న స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం `దబాంగ్ 3`. దబాంగ్ సిరీస్ చిత్రాల వరుసలో వస్తున్న సిరీస్ ఇది. సల్మాన్ లక్కీ డైరెక్టర్ ప్రభుదేవా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ... ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది... ఇక ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ లో... టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్, విక్టరీ వెంకటేష్, సల్మాన్ కలిసి చిందేసి ప్రేక్షకులను అలరించారు. బాలీవుడ్, టాలీవుడ్ టాప్ స్టార్లు ఇద్దరూ కలిసి స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తే చూసే ప్రేక్షకులకు రెండు కళ్ళు చాల్లేదనే చెప్పాలి. అందరూ అంత సంబంరంగా ఎంతో ఆనందంగా డ్యాన్స్ చేసి చూసేవారికి కనులపండుగ చేశారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో పాటు దర్శకుడు ప్రభుదేవా ఇంకా చిత్ర యూనిట్ ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.
సల్మాన్‌ఖాన్ మాట్లాడుతూ - ``హైదరాబాద్ ప్రజలు ఎంతో ఘనంగా స్వాగతం పలికారు. హిందీలో నా సినిమాలు ఇక్కడ రిలీజ్ అయ్యేవి. మంచి రెస్పాన్స్ వస్తుండేవి. ఆ రెస్పాన్స్‌ను చూసి తెలుగులో కూడా రిలీజ్ చేయాలని దబాంగ్ 3ని తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. రామ్‌చరణ్ నాకు ఎంతో సన్నిహితుడు. నా చిన్నతమ్ముడిగా భావిస్తాను. చిరంజీవిగారితో ఎంతో సన్నిహితం ఉంది. వెంకటేశ్‌గారితో 25ఏళ్లుగా పరిచయం ఉంది. ప్రభుదేవాగారు చక్కగా డైరెక్ట్ చేశారు. సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను.