ఫస్టాఫ్ మొత్తం అనిల్ పంచ్ డైలాగులతో కామెడీ సీన్లతో పేలిపోతుంది. థియేటర్లు అంతా నవ్వులతో దద్దరిల్లుతున్నాయి. ప్రేక్షకులు నవ్వలేక కడుపు పట్టుకుంటున్నారు. అంత ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంది. మహేష్‌ను లైన్లో పెట్టేందుకు రష్మిక అండ్ ఆమె తల్లి సంగీత వాళ్ల ఫ్యామిలీ చేసే కామెడీ మాములుగా లేదుగా... నవ్వి.. నవ్వి.. పొట్ట చెక్కలవుతుంది. 20 నిమషాల పాటు కామెడీని ఆపకుండా దర్శకుడు అనిల్ రావిపూడి జనరేట్ చేస్తూనే ఉన్నాడు. అందులో అనిల్ దిట్ట అనే చెప్పాలి. ఈ రోజుల్లో ఎంత కామెడీ ఉంటే ప్రేక్షకులు అంత ఎంజాయ్ చేస్తారు అని అనిల్ సినిమాతో రుజువవుతుంది. ప్రేక్షకులు కాసేపు ఏదో ఫుల్ ఎంజాయ్ చేయడానికి థియేటర్సకు వస్తారు. దాన్ని పూర్తి ఎంటర్ టైన్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి కామెడి నాన్‌స్టాప్‌గా ప్రేక్షకులు నవ్వేలా ఉంది. `ఎఫ్ 2` సినిమాలో `అంతేగా అంతేగా` డైలాగు టైపులో రష్మిక అండ్ఫ్యామిలీ `నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్` డైలాగ్‌లు పదే పదే పేలుతోంది చివరకు ట్రైన్ ఎపిసోడ్ ముగిసిన వెంటనే అబ్బబ్బ ఎంత ముద్దుగున్నాడే సాంగ్ వస్తోంది.ఈ సాంగ్ ఆల్రెడీ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.
అనిల్ సినిమా అంటేనే కామెడీ, పంచ్‌డైలాగులతో పాటు ఒక్కొక్కరికి ఒక్కో మ్యానరిజమ్ పెట్టడం బాగా అలవాటు. అలాగే ఇందులో రెండు మూడు మ్యానరిజమ్స్ ఉండడంతో అందులోనూ అవి వచ్చే సీన్స్ అదిరిపోవడంతో ఫుల్ లెంగ్త్ కామెడీ అలాగే సాగుతోంది. మ్యానరిజమ్స్‌లో వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ మాములుగా లేవు. అదిరిపోయే ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సూపర్‌స్టార్ మహేశ్ హీరోగా దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జిఎంబి ఎంటర్టైన్మెంట్, ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ 'సరిలేరు నీకెవ్వరు'. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలయింది.