ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ ప్రమాదకరంగా పరిణమిస్తున్న కరోనా వైరస్ ప్రతి రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ప్రపంచం కనీవినీ ఎరుగని ఆర్థిక నష్టాన్ని కలుగజేస్తోంది. కరోనా వైరస్‌ ప్రభావంతో ఈ నెలాఖరు వరకు సినిమా షూటింగ్‌లు ఆపివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. చలన చిత్ర పరిశ్రమ పెద్దలు కూడా మార్చి 31వరకు షూటింగ్‌లు ఆపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం(మార్చి 24,2020) నుంచి గాంధీ, ఫీవర్ ఆస్పత్రి, ఉస్మానియా, చెస్ట్, కింగ్ కోఠి ఆస్పత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇక రెగ్యులర్ చెకప్‌లు, అత్యవసరం కాని ఆపరేషన్లను ఇప్పటికే నిలిపివేసిన సంగతి తెలిసిందే.  హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు నిలిపివేసింది.

 

ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.   తాజాగా కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసం ఇప్పుడు సెలబ్రెటీలు కదులుతున్నారు.  ఇండస్ట్రీలో పేద కళాకారుల కోసం వారం రోజుల పాటు ఆహారం సప్లై చేసేందుకు సిద్దమయ్యారు డాక్టర్ రాజశేఖర్ జీవిత దంపతులు.  ఇక తమిళ  చిత్ర పరిశ్రమలో వివిధ శాఖలలో పనిచేస్తున్న కార్మికులను ఆదుకోవడానికి పలువురు నటీనటులు ముందుకు వస్తున్నారు.సీనియర్ నటులు శివకుమార్, సూర్య, కార్తీ కుటుంబ సమేతంగా ముందుకు వచ్చారు.

 

షూటింగ్స్ లేక రోజు గడవడం కష్టంగా వున్న కార్మికులకు తమవంతు సహాయంగా సూర్య, కార్తీలు  విరాళాన్ని ప్రకటించారు.  వారిని ఆదుకునేందుకు  10లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఇక టాలీవుడ్ హీరో ఈ క్రమంలో టాలీవుడ్  తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు మొత్తం రూ.20 లక్షలు విరాళం ప్రకటించారు. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.10 లక్షలు, ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.10 లక్షలు అందించాలని నిర్ణయించుకున్నారు. ఇండస్ట్రీనే  జీవితంగా బతుకుతున్న వివిధ శాఖలలోని కార్మికులు ఇబ్బంది పడకూడదని తమవంతుగా ఈ చిన్న సహాయం చేస్తున్నామని సూర్య అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: