ఒకరకంగా ఈ మహమ్మారి కరోనా మనకు కొంతమేరకు మంచి చేసిందని అంటున్న వారు కూడా లేకపోలేదు. ఎందుకంటే దీనివలన దేశంలో కొన్ని వారాలుగా లాక్ డౌన్ అమలవుతుండడంతో, పలువురు తమ ఫ్యామిలీ లకు బాగా దగ్గరవడంతో పాటు తమ ఇంట్లోని ఆడవారికి పనుల్లో కొంత సాయపడవచ్చని అంటున్నారు. అయితే ఇదే కాన్సెప్ట్ నేపథ్యంలో ఇటీవల అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రారంభించిన బి ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ ప్రస్తుతం టాలీవుడ్ నటీనటులు, దర్శకులు సహా ఒకరి నుండి మరొకరికి చేరుతోంది. కాగా మొన్న మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, సూపర్ డైరెక్టర్ కొరటాల శివ, లెజెండరీ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి సహా మరికొందరు సినిమా ప్రముఖులు పాల్గొన్న ఈ ఛాలెంజ్ ప్రస్తుతం వేగవంతంగా మంచి ఆసక్తికరంగా ముందుకు సాగుతోంది. 

IHG

ఎంతో గొప్ప ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికి కూడా ఇంటి పనుల్లో తమ ఇంట్లోని ఆడవారికి ఇటువంటి సమయంలో సాయపడడం ఎంతో ఆనందంగా ఉందని అంటున్న నటులు, ఎవరికి తోచిన విధంగా వారు వంటలు చేయడం, ఇల్లు తుడవడం, లాన్ లో గడ్డి కోయడం, మొక్కలకు నీళ్లు పోయడం వంటి పలు కార్యక్రమాలు చేస్తూ ఈ ఛాలెంజ్ ని పూర్తి చేస్తూ మిగతావారికి కూడా ఛాలెంజ్ విసురుతున్నారు. ఇకపోతే నిన్న ఈ ఛాలెంజ్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన కొరటాల శివ, దానిని యూత్ హీరో విజయ్ దేవదకొండకు విసరడం జరిగింది. అయితే కొరటాల పెట్టిన మెసేజ్ పై స్పందించిన విజయ్, నిన్న రాత్రి ఒక ట్వీట్ చేసారు. 

 

కొరటాల గారు మీరు నాకు ఇచ్చిన ఛాలెంజ్ బాగుంది, కాకపోతే మా అమ్మ మమ్మల్ని ఇంటి పనులు చేయనీయడం లేదు, అలా చేస్తే నాకు డబుల్ పని అవుతుందని అంటోంది. అయినా మీరు రియల్ మెన్ కాదు ఇంకా చిన్నపిల్లలే అని కూడా అంటోంది, కానీ ఎలాగైనా ఈ లాక్ డౌన్ పూర్తి అయ్యేలోపు మీరిచ్చిన ఛాలెంజ్ ని మాత్రం పూర్తి చేస్తాను సర్ అంటూ ఫన్నీగా పోస్ట్ చేయడం జరిగింది. అయితే విజయ్ పెట్టిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా, పలువురు నెటిజన్లు ఆ ట్వీట్ కి స్పందిస్తూ మరింత సరదాగా కామెంట్స్, రీట్వీట్స్ చేస్తున్నారు....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: