కార్తికేయ సినిమాతో దర్శకుడిగా ప్రతిభ చాటిన చందు మొండేటి ఆ సినిమాతో రాజమౌళి నుండి కూడా ప్రశంసలు పొందిన చందు మొండేటి ఆ తర్వాత ప్రేమమ్ రీమేక్ తో సత్తా చాటాడు. అయితే ఆ సినిమాతో దర్శకుడిగా చందు టాలెంట్ చూసైనా నాగ చైతన్య మరో ఛాన్స్ కూడా ఇచ్చాడు. ఇద్దరి కాంబినేషన్ లో సవ్యసాచి సినిమా చేశాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా సవ్యసాచి. విభిన్న కథ రాసుకుంటే దాన్ని అంతే కథగా విభిన్నంగా తెరకెక్కించాల్సి ఉంటుంది. 

 

కథ బాగున్నా.. కమర్షియల్ హంగుల పేరిట అనవసరమైనవి చేర్చితే ఫలితం అలానే ఉంటుందని అంటున్నారు. సవ్యసాచి విషయంలో తాను తీసుకున్న నిర్ణయాల వల్లే తప్పులు జరిగాయని డైరక్టర్ చందు మొండేటి ఒప్పుకున్నాడు. సవ్యసాచి సినిమా ఫలితం నాగ చైతన్యను నిరాశపరచింది అయితే తనతో రిలేషన్ మాత్రం ఇప్పటికి బాగుందని అన్నారు సవ్యసాచి. ప్రస్తుతం కార్తికేయ 2 డైరెక్ట్ చేస్తున్న చందు మొండేటి సినిమా నుండి వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెరిగాయి. 

 

కార్తీకేయ 2ని కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. సవ్యసాచి విషయంలో జరిగిన తప్పుల వల్ల చాల విషయాలు నేర్చుకున్న చందు ఇక మీదట అలంటి తప్పులు చేయకూడదని భావిస్తున్నారట. కార్తికేయ 2 సినిమాతో మళ్ళీ చందు తన టాలెంట్ చూపించాలని చూస్తున్నారు. కార్తికేయ 2లో నిఖిల్ సిక్స్ ప్యాక్ తో కనిపిస్తాడని అంటున్నారు. కార్తికేయ సినిమాకు ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని తెలుస్తుంది. సీక్వల్ టైటిల్ పెట్టినా కథ మాత్రం కొనసాగింపు ఉండదని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు సంబందించిన మిగతా డిటైల్స్ తెలియాల్సి ఉంది.       
 

మరింత సమాచారం తెలుసుకోండి: