అన‌గ‌న‌గా ఓ టాలీవుడ్ హీరోయిన్‌.. ఎక్క‌డో నార్త్ నుంచి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన అమ్మ‌డు చూడ‌డానికి చాలా బ‌క్క‌ప‌ల్చ‌గా ఉంటుంది. కెరీర్ స్టార్టింగ్ లో ఓ బ‌డా ఫ్యామిలీ హీరోతో న‌టించిన‌ప్పుడే వివాదం క్రియేట్ చేసుకుంది. కెరీర్ లో ఇద్ద‌రు ముగ్గురు యంగ్ హీరోల‌తో న‌టించిన ఆమెకు ఒక్క సారిగా సుడి తిరిగేసింది. వ‌రుస పెట్టి ఎన్టీఆర్‌, మ‌హేష్ బాబు, అల్లు అర్జున్‌, రామ్ చ‌ర‌ణ్ లాంటి హీరోల‌తో న‌టించింది. ఇందులో కొన్ని హిట్ సినిమాలు ఉంటే.. మ‌రి కొన్ని ప్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. ఒక్క సారిగా ఓ వెలుగు వెలిగిన ఆ హీరోయిన్ కు స్టార్ హీరోయిన్ క్రేజ్ వ‌చ్చేసింది.

 

ఇక తెలుగు తో పాటు అటు త‌మిళ్ లోనూ స్టార్ హీరోల‌తో న‌టించింది. అక్క‌డ కూడా మంచి సినిమాలు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత హైద‌రాబాద్ లో ఖ‌రీదైన ల‌గ్జ‌రీ విల్లా కొనుక్కుంది. ఇక్క‌డ వ్యాపారం కూడా స్టార్ట్ చేసింది. అక్క‌డితో ఆగ‌కుండా హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ లో నూ ఓ నిర్మాత‌తో క‌లిసి పెట్టుబ‌డులు పెట్టింది. ఇవ‌న్నీ ఇలా ఉంటే రాజ‌కీయ నాయ‌కుల‌తో ప‌రిచ‌యం పెంచుకున్న ఆమె ఓ మంత్రి గారితో రాస‌లీల‌ల వ్య‌వ‌హారం కొన‌సాగిస్తోంద‌ట‌.

 

గ‌త యేడాది కాలంగా అత్యంత గుట్టుగా సాగుతోన్న ఈ తంతు ఎప్పుడో ఒక‌ప్పుడు బ‌య‌ట‌కు రాకుండా ఉండ‌దు క‌దా..?  ఇప్పుడు ఈ హీరోయిన్ ... స‌ద‌రు మంత్రి గారి రాస‌లీల‌ల వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారింది. స‌ద‌రు మంత్రిహీరోయిన్ ఇప్పుడు వీలున్న‌ప్పు డ‌ల్లా క‌లుసుకుని త‌మ ప‌నులు తాము కానిచ్చేస్తున్నార‌ట‌. మ‌రో ట్విస్ట్ ఏంటంటే స‌ద‌రు హీరోయిన్ గారి వ్యాపారాల‌కు.. ఇత‌ర‌త్రా అవ‌స‌రాల‌కు సైతం ఆ మంత్రి గారు బాగానే కోప‌రేట్ చేస్తున్నాడ‌ట్ట‌.  స‌ద‌రు మంత్రి ఆ ప్ర‌భుత్వంలో చాలా కీల‌కం అండోయ్‌..?

 

ఇక ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆమెకు సినిమాల్లో ఎలాగూ ఛాన్సులు వ‌చ్చే ప‌రిస్థితులు లేవు. ఏదైనా చేస్తాను.. ఛాన్సులు ఇమ్మ‌ని అడిగినా ఆమెను ఇండ‌స్ట్రీలో ఎవ్వ‌రూ ప‌ట్టించు కోవ‌డం లేదు. ఇక ఇప్పుడు హైద‌రాబాద్‌లో సెటిల్ అయ్యి ఇలాంటి ప‌నులు చేస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: