టాలీవుడ్ లో చిరంజీవి సినిమాలకు ఉండే క్రేజ్ అందరికి తెలిసిందే. కథలో పట్టు ఉన్నా లేకపోయినా సరే ఆయన మాత్రం సినిమాను ఒక రేంజ్ కి తీసుకుని వెళ్తూ ఉంటారు అనే అవగాహన చాలా మందికి ఉంది. ఇకa ఆయన సినిమాలు అనగానే ఎక్కువగా ఆకట్టుకునేది మాస్ ఆడియన్స్ నే. వారి కోసమే ఆయన అసలు సినిమాలు చేస్తారు అని కొందరు కామెంట్స్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి అప్పట్లో. ఇక అది అలా ఉంటే ఆయన సినిమాల్లో భారీ అంచనాలతో వచ్చి ఫ్లాప్ అయిన సినిమా అందరి వాడు. ఈ సినిమా  కథ సరిగా లేక షాక్ ఇచ్చింది. 

 

సినిమాలో చిరంజీవి చాలా బాగా నటించారు. తండ్రి కొడుకు పాత్రల్లో ఆయన తన నటనకు న్యాయం చేసారు అనేది వాస్తవ౦. కథ ఏ విధంగా ఉన్నా సరే ఆయన చేసిన కామెడి కి మాత్రం మంచి స్పందన వచ్చింది అనేది వాస్తవం. సినిమాను ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని చేసి ఉంటే దాని స్థాయి మరో రేంజ్ లో ఉండేది అని చెప్తారు.  కామెడి కి ఎక్కువగా సినిమా యూనిట్ ప్రాధాన్యత ఇచ్చింది అని అంటారు. అందుకే సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి సినిమాలకు దూరమై రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 

 

ఈ సినిమాలో ఆయన నటన ఒక హైలెట్ అయితే సినిమాలో ఉన్న కామెడి మరో హైలెట్.  కామెడి తో సినిమాను ముందుకు నడిపించారు అనే చెప్పాలి. ఇక ఈ సినిమా బుల్లి తెర మీద  వస్తే మాత్రం కామెడి కోసం కచ్చితంగా చూస్తూ ఉంటారు జనాలు అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఇక దర్శకులు సినిమాలో కామెడి ఎంత ఉండాలో కథ కూడా అంతే ఉండాలి అని జాగ్రత్తలు తీసుకుని చేస్తూ వచ్చారు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: