ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్. పూజా హెగ్డే హీరోయిన్ గా, అద్భుతమైన ప్రేమకథగా పలు యాక్షన్, ఎమోషనల్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, గోపీకృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ సంస్థలు అత్యంత భారీ ఖర్చుతో, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నాయి. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది.
కొన్నేళ్ళ క్రితం యూరప్ లో జరిగిన ఒక యదార్ధ ప్రేమకథను బేస్ చేసుకుని దర్శకుడు రాధాకృష్ణ తీస్తున్న ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయని, కాగా వాటికి పలువురు హాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన అగ్రశ్రేణి ఫైట్ మాస్టర్స్ పనిచేశారని, రేపు వెండితెరపై ఆ యాక్షన్, ఫైట్ సీన్స్ ని చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ కు నిజంగా గూస్బంప్స్ రావడం ఖాయం అంటున్నారు. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి భాగ్యశ్రీ ప్రభాస్ కు తల్లిగా నటిస్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ నిజంగా అదరగొడితే మాత్రం, ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది నిజంగా గొప్ప పండుగ వార్త అని చెప్పక తప్పదు.....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి