మలైకా అరోరా గుర్తుందా దబాంగ్ లో మున్ని బదనాం సాంగ్ తో ఫేమస్ అయ్యి గబ్బర్ సింగ్ సినిమాతో కెవ్వు కేక పాటతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఈ చిన్నది ఇప్పుడు మరో ఐటం సాంగ్ తో అలరించనుందట. అయితే ఆమే కాలు కదిపేది టాలీవుడ్ లో కాదు. బాలీవుడ్ లోనే. తన భర్త అర్భాజ్ ఖాన్ నిర్మిస్తున్న డాలీ కి డాలీ సినిమాలో మరీ సారి మలైకా ఐటం సాంగ్ చేస్తుంది.
దబాంగ్ లో హాట్ ఐటం గా చేసిన మలైకా ఆ తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈ హాట్ ఐటం తో బాలీవుడ్ ఆడియెన్స్ ని అలరించనుంది. ఆల్రెడీ ఇద్దరు పిల్లలకు తల్లైన మలైకా తన భర్త కోసం ఐటం చేయడానికి వెనకడుగు వేయట్లేదు. తన ఓన్ ప్రొడక్షన్ లో ఐటం సాంగ్ చేస్తూ సినిమా హిట్ కూడా తన వంతు కృషి చేస్తుంది మలైకా అరోరా..
ఐటం సాంగ్ అనే కాదు కొన్ని యాడ్స్ లో కూడా నటిస్తూ తన ఫ్యాన్స్ ని అలరిస్తుంది మలైకా.. ఇక డాలీ కి డాలీ సినిమాలో సోనం కపూర్ లీడ్ రోల్ లో చేస్తుంది. అభిషేక్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు ప్రొడ్యూసర్ అర్భాజ్ ఖాన్.
మలైకా ఐటం సాంగ్ పై మీ కామెంట్..?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి