నందమూరి వారి ఇంట నటన పుట్టిందని అంటారు. అందువల్ల వారికి సినిమాలూ .. నటన కొత్త కాదు. అలాగే ప్రయోగాలు చేయడానికి వారెప్పుడూ భయపడలేదు, ముందే ఉంటారు, మొదటి తరంలో ఎన్టీయార్ ఈ రకమైన ప్రయోగాలు చేసేవారు. రాముడు వేసిన ఆయనే రావణుడిగా వేశారు. క్రిష్ణడుగా వేసిన ఆయనే  కీచకుడు, దుర్యోధనుడు కూడా తానే  అన్నట్లుగా కనిపించేవారు. ఇపుడు ఆయన మనవడు కళ్యాణ్ రాం ప్రయోగాలు చేయడంలో ఫస్ట్ అయి చెప్పాలి. కళ్యాణ్ రాం సినిమాల సక్సెస్ రేటు తక్కువగా ఉన్నా రిస్క్  తీసుకుని మూవీస్ చేయడంతో మాత్రమే ఆయన గ్రేటే మరి.

ఇదిలా ఉంటే వరసగా ముగ్గురు కొత్త వారికి కళ్యాణ్ రాం మూవీ ఆఫర్స్ ఇచ్చారని తెలుస్తోంది. ఇపుడున్న పొజిషన్లో కొత్త వారికి చాన్స్ ఇచ్చి మూవీస్ చేయడం అంటే కళ్యాణ్ రాం గట్స్ ని మెచ్చాల్సిందే. ఈ ముగ్గురు ఎవరా అంటే ఒకరు ఎన్టీయర్ బయోగ్రఫీ మీద బాలయ్య తీసిన సినిమాకు పనిచేసిన రవికాంత్ అనే న్యూ టాలెంట్. అతను చెప్పిన కధను నచ్చి సినిమాకు కళ్యాణ్ రాం ఓకే చెప్పేశారు.

ఆ తరువాత డైరెక్టర్ వినాయక్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన రమేష్ అనే కొత్త డైరెక్టర్ కి చాన్స్ ఇవ్వడానికి కళ్యాణ్ రాం రెడీ అవుతున్నారు. అతను చెప్పిన కధ కూడా నందమూరి హీరోకు నచ్చిందట. అలాగే వశిష్ట అనే మరో కొత్త డైరెక్టర్ కీ ఒకే చెప్పేశాడట. ఇలా బ్యాక్ టు బ్యాక్ ముగ్గురు కొత్త డైరెక్టర్లతో సినిమాలు అంటే కళ్యాణ్ రాం ఎంతగా న్యూ టాలెంట్ కి కేరాఫ్ అడ్రస్ గా మారారో అర్ధం చేసుకోవాల్సిందే.

మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుత్రం రెండు సినిమాలను సెట్స్ మీదకు తెస్తున్న కళ్యాణ్ రాం ఈ మూడు సినిమాలను కూడా కరోనా తరువాత వరసగా చేయడానికి డిసైడ్ అయ్యాడుట. ఓ వైపు నిర్మాతగా ఉంటూనే మరో వైపు హీరోగా కూడ వెరైటీ సినిమాలు ఎంచుకుంటున్న కళ్యాణ్ రాం ని మెచ్చుకోవాల్సిందేంగా.

మరింత సమాచారం తెలుసుకోండి: