సూపర్ స్టార్ మహేష్ బాబు అతి త్వరలో నటించనున్న సినిమా సర్కారు వారి పాట. మహేష్ బాబు ఒక డిఫరెంట్ రోల్ లో నటించనున్న ఈ సినిమా కు ఎస్. ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తుండగా 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ కలిసి దీనిని ఎంతో భారీ రేంజ్ లో నిర్మించనున్నాయి. గీతా గోవిందం దర్శకుడు పరశురాం పెట్ల దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా పై మహేష్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు ప్రేక్షకాభిమానులు నుండి మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై బాగా అంచనాలు ఏర్పరిచింది.  

బ్యాంక్ మోసాలు, కుంభకోణాల నేపథ్యంలో పలు కమర్షియల్ హంగులతో తెరకెక్కనున్న ఈ సినిమా ద్వారా తొలిసారిగా మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోందని ఇటీవల కొన్నాళ్లుగా వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. అలానే కొన్నాళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూ లో భాగంగా తాను సర్కారు వారి పాట మూవీ లో తొలిసారిగా మహేష్ కు జోడీగా నటిస్తున్నట్లు చెప్పింది కీర్తి. అయితే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, హఠాత్తుగా ఆమె ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు చెప్తున్నారు.  

అయితే కారణం ఏమిటి అనేది తెలియనప్పటికీ, కొందరు మాత్రం ఆమెకు డేట్స్ ఖాళి లేని కారణంగానే ఆమె సినిమా నుండి తప్పుకుందని అంటున్నారు. మరోవైపు అతి త్వరలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న ఈ తరుణంలో కీర్తి నుండి వచ్చిన ఈ షాకింగ్ న్యూస్ తో ఒక్కసారిగా ఆలోచనలో పడ్డ సర్కారు వారి పాట యూనిట్, ఆమె స్థానంలో మరొక నటిని తీసుకునేందకు సిద్దమయ్యారట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే మాత్రం ఆ సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే ....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: