రంగస్థలం సినిమాతో భారీ హిట్ కొట్టినా.. ఆ తర్వాత వచ్చిన వినయ విధేయ రామ సినిమాతో ఫ్లాప్ చవిచూశాడు. మాస్ దర్శకుడు బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టనే కొట్టింది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలపై ఆందోళనలు చెలరేగడంతో.. అలాంటి పరిస్థితులు మళ్లీ ఎదురు కాకుండా జాగ్రత్త పడుతున్నాడు రామ్ చరణ్.
తెలుగు సినిమా చరిత్రలోనే బాహుబలి తర్వాత అంతే స్థాయి అంచనాలతో రాబోతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి ఆధ్వర్యంలో డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొందుతోన్న ఈసినిమాలో రామ్ చరణ్.. జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రల్లో నటించనున్నారు. అంతేకాదు ఎంతో మంది ప్రముఖులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించనున్నారు.
ఆర్ఆర్ఆర్ ప్రస్తుత కరోనా కారణంగా విడుదల కాకపోవచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే 2021లో ఆ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ సినిమా ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే చిరంజీవి నటించే ఆచార్య సినిమాలో రామ్ చరణ్ బొద్దుగా కనిపించబోతున్నాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి