సీనియర్ స్టార్ గా ఆయన అంత రిస్క్ చేసుకుని మరి హోస్ట్ గా అదరగొట్టేస్తున్నారు. ఓ విధంగా ఇది నాగార్జునకు మాత్రమే సాధ్యమైందని చెప్పొచ్చు. మీలో ఎవరు కోటీశ్వరుడు థర్డ్ సీజన్ చిరు హోస్ట్ గా చేశారు. కాని ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు. అఫ్కోర్స్ చిరు ఓ ప్రయత్నం అయినా చేశారు. కాని సీనియర్ హీరోల్లో వెంకటేష్, బాలకృష్ణ మాత్రం బుల్లితెరకు ఆమడం దూరంలో ఉంటారు. బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్ గా కొన్నాళ్ళు వెకటేష్ కూడా చేస్తాడని వార్తలు వచ్చాయి. కాని మళ్ళీ నాగ్ సర్ ప్రైజ్ చేశారు.
వెంకటేష్ కూడా నాగార్జున రూట్ లోకి వచ్చి స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ కు దగ్గరవ్వాలని చూస్తున్నాడు. ఇక బాలయ్య బాబు మాత్రం స్మాల్ స్క్రీన్ కు చాలా దూరం. ఆయన సినిమాలు.. పొలిటికల్ నేతగా పనులే సరిపోతున్నాయి. అయితే బాలకృష్ణ కూడా ఏదైనా స్మాల్ స్క్రీన్ షో హోస్ట్ గా చేస్తే చూడాలని అనుకుంటున్నారు నందమూరి ఫ్యాన్స్. ఇక యంగ్ స్టార్స్ లో ఆల్రెడీ ఎన్.టి.ఆర్ బిగ్ బాస్ హోస్ట్ గా చేశాడు. నాని కూడా సీజన్ 2 బిగ్ బాస్ చేశాడు. అల్లు అర్జున్, రాం చరణ్, మహేష్, పవన్, ప్రభాస్ లు మాత్రం స్మాల్ స్క్రీన్ వైపు చూడట్లేదు. మరి వాళ్ళు కూడా స్మాల్ స్క్రీన్ పై సందడి చేసే రోజు ఒకటి వస్తుందని రావాలని ఆశిద్దాం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి