హీరోయిన్‌గా సూపర్ సక్సెస్‌లు ఉంటేనే కెరీర్‌కి గ్యారెంటీ ఉండటం లేదు. అలాంటిది నెగటివ్‌ రోల్‌ వైపు వెళ్తే కెరీర్‌ ఉంటుందా.. మరి బోల్డ్‌ విలన్‌గా కనిపించబోతోన్న తమన్నా పరిస్థితి ఏంటి? తెలుగు అంధాదున్‌ మిల్కీకి ప్లస్‌ అవుతుందా.. మైనస్‌ అవుతుందా అనే కొత్త అనుమానాలు సగటు ప్రేక్షకునిలో తలెత్తుతున్నాయి.  

తమన్నా కెరీర్‌ స్లో ఫేజ్‌లోకి వెళ్లిపోయి చాలా రోజులవుతోంది. ఈమెకి స్టార్‌ హీరోల సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌ వస్తున్నాయి గానీ హీరోయిన్ రోల్స్ మాత్రం రావడం లేదు.  ఇలాంటి సమయంలోనే 'అంధాదున్' రీమేక్‌కి సైన్‌ చేసింది తమన్నా. ఈ మూవీలో విలన్‌గా నటించబోతోంది మిల్కీ బ్యూటీ.

హిందీలో టబు ప్లే చేసిన క్యారెక్టర్‌ని ఇక్కడ తమన్నా రీప్లేస్ చేస్తోంది. అయితే ఈ క్యారెక్టర్‌కి అక్రమ సంబంధం ఉంటుంది. ఈ సంబంధం కోసం భర్తని కూడా చంపేస్తుంది. హత్యని చూసిన హీరోని కూడా చంపాలనుకుంటోంది. ఇలాంటి క్యారెక్టర్‌ తమన్నా కెరీర్‌కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అంటే మిక్స్‌డ్ ఆన్సర్స్‌ ఇస్తున్నారు సినీజనాలు.

'అంధాదున్‌' రీమేక్‌లో తమన్నాది పెర్ఫామెన్స్‌కి స్కోప్‌ ఉన్న క్యారెక్టర్. సో నెగటివ్‌ రోల్‌తో మిల్కీలోని ఆర్టిస్ట్‌ సాటిస్‌ఫై అవ్వొచ్చు. అయితే విలన్‌గా చేశాక మళ్లీ తమన్నాకి హీరోయిన్‌ రోల్స్‌ రావడం కష్టమే.. రమ్యక్రిష్ణ నీలాంబరి లాంటి నెగటివ్‌ రోల్‌ చేసినా అందులో డిగ్నిటీ ఉంది.. 'అంధాదున్‌'లో అది కనిపించట్లేదు. కాబట్టి తమన్నాకి కొంచెం కష్టమే అంటున్నారు జనాలు.

మొత్తానికి తమన్నా ఎపుడూ చేయని సాహసం చేస్తోంది. అలా చేస్తే తన కెరీర్ రాబోయే రోజుల్లో ప్రమాదంలో పడుతుందని అనుకుందో లేదో అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అదీ.. నెగిటివ్ రోల్ పోషించడం అంటే అదో పెద్ద సాహసమే అని చెప్పారు. ఈ పాత్ర తన కెరీర్ పై గట్టిగా పడుతుందనే ఆమె అభిమానులు చెవులు కొరుక్కుంటున్నారు. చూద్దాం.. ఈ నెగిటివ్ రోల్ తో ఆమె సినీ జీవితం ఎంతవరకు వెళుతుందో.




మరింత సమాచారం తెలుసుకోండి: