మన తెలుగు అగ్రహీరోలలో జూనియర్ ఎన్టీఆర్  ఎప్పుడు కూడా ప్రత్యేకంగా కనబడుతూ ఉంటాడు. ఏ సినిమా చేసినా సరే తన నటన విషయంలో జూనియర్ ఎన్టీఆర్ చాలా వరకు కూడా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా ఈ మధ్య కాలంలో అతను సినిమాలను విడుదల చేస్తున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమాల విషయంలో ఇబ్బందులు పడుతున్నాడు అనే వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాల్లో వినబడుతున్నాయి. సినిమాలను విడుదల చేసే విషయంలో చాలా బాగా ఆలస్యం అవుతుంది.

అరవింద సమేత సినిమా కోసం దాదాపు రెండేళ్ల పాటు సమయం తీసుకున్నాడు. ఇక ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమా కోసం దాదాపు రెండు మూడేళ్ల నుంచి కష్టపడుతున్నాడు. అయినా సరే ఈ సినిమా ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు కనపడటం లేదు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ లో కాస్త సహనం అనేది ఉంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా మాత్రం కేవలం ఆరు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది వేసవి తర్వాత మొదలుపెట్టి అవకాశాలు ఉండొచ్చని ప్రచారం జరిగింది.

అయితే ఇప్పుడు ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత నుంచి మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ లో సమాచారం. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు నాటికి విడుదల చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఏది ఎలా ఉన్నా మాత్రం ఈ సినిమా వార్తలు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ట్రిపుల్ ఆర్  సినిమాను వచ్చే ఏడాది వేసవిలో లేదా ఆగస్టులో విడుదల చేసే అవకాశాలు ఉండవచ్చు. అదే జరిగితే రెండు సినిమాలు కూడా ఒకేసారి వచ్చే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: