అవునూ.. మెగా అల్లుడు ఓ ఫ్లాప్ డైరెక్టర్ కి అవకాశమిచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇంతకీ ఆ మెగా అల్లుడు ఎవరు? మరి అతని నుండి అవకాశం  అందుకున్న ఆ ఫ్లాప్ డైరెక్టర్ ఎవరు? అనే విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ "విజేత" అనే సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే "జతకలిసే" మూవీ ఫేం రాకేష్ శశి దర్శకత్వం వహించాడు. బాగుంది అనే టాక్ తెచ్చుకున్నప్పటికి ఏవరేజ్ గా నిలిచింది. మలయాళ బ్యూటీ మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. అయితే రెండో ప్రయత్నంగా పులివాసు దర్శకత్వంలో "సూపర్ మచ్చి" అనే సినిమా చేస్తున్నాడు. రిజ్వాన్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రిజ్వాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో మొదట రియా చక్రవర్తిని హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య నేపథ్యంలో ఈమెపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కన్నడ హీరోయిన్ రచిత రామ్ ను తీసుకున్నారు.
ఇదిలా ఉంటే.. తాజగా కళ్యాణ్ దేవ్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఆ దర్శకుడు "అశ్వద్ధామ" మూవీ ఫేం రమణ తేజ అని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్స్ ఇవాళే జరిగినట్లు సమాచారం. వరుసగా సినిమాలకు సైన్ చేస్తున్న కళ్యాణ్ దేవ్ ప్లాప్ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వడంతో ఆయన స్ట్రాటజీ ఏంటనే చర్చ జరుగుతోంది. రమణ తేజ్ దర్శకత్వంలో వచ్చిన "అశ్వద్ధామ" మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే కళ్యాణ్ దేవ్ కు రమణ తేజ్ చెప్పిన బాగా నచ్చడంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఖచ్చితంగా హిట్టు కొట్టాల్సిన సమయంలో కళ్యాణ్ దేవ్ ప్లాప్ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వడంపై మెగా అభిమానులు షాకవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: