వరుసగా క్రేజీ ఛాన్సులు అందుకుంటున్న కృతి శెట్టికి మరో ఛాన్స్ వచ్చింది. మళయాళ సూపర్ హిట్ మూవీ కప్పెల రీమేక్ లో కృతి శెట్టికి అవకాశం ఇచ్చారని తెలుస్తుంది. సినిమాలో విశ్వక్ సేన్, నవీన్ చంద్ర హీరోలుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా కృతి శెట్టిని ఫిక్స్ చేశారట. అక్కడ సూపర్ హిట్టైన ఈ సినిమా తెలుగులో కూడా అదే రిజల్ట్ రిపీట్ చేస్తుందని అంటున్నారు.
విష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి నటించిన ఉప్పెన సినిమా రిలీజ్ కాకుండానే ఆమెకు వరుసగా 3 ఛాన్సులు వచ్చాయి. చూస్తుంటే ఇప్పుడున్న స్టార్స్ కు కృతి శెట్టి కూడా తప్పకుండా గట్టి పోటీ ఇచ్చేలా ఉందని చెప్పొచ్చు. తెలుగులో కృతి శెట్టి తప్పకుండా క్లిక్ అయ్యేలా ఉందని అంటున్నారు. టాలీవుడ్ లో ఎలాగు హీరోయిన్ల కొరత ఉంటుంది. అందుకే కృతికి వరుస ఛాన్సులు వస్తున్నాయని అంటున్నారు. ఉప్పెన హిట్టైతే మాత్రం అమ్మడికి డబుల్ క్రేజ్ వచ్చేస్తుందని చెప్పొచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి