ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సౌత్ ఇండియా స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన అంటే ఇష్టపడని ప్రేక్షకులు లేరు.సినిమాలో పాత్ర నచ్చాలే గానీ సూర్య ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. బాలా దర్శకత్వంలో ‘శివపుత్రుడు’లాంటి సినిమాలో నటించి ఎంతగానో  మెప్పించాడాయన. అందులో విక్రమ్‌తో కలిసి నటించడం  మరో విశేషం. ఇక ఆ చిత్ర దర్శకుడు బాలా ముగ్గురు హీరోలతో ఓ సినిమా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నార. ఈ మల్టీస్టారర్ కోసం ఆయన స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారట. ఇందులో సూర్య, అథర్వ, ఆర్య నటిస్తే బాగుంటుందని బాలా అనుకుంటున్నారట.

ఈ ముగ్గురూ గతంలో బాలా దర్శకత్వంలో నటించిన వారు కావడం విశేషం.తన కొత్త చిత్రం కోసం బాలా ఈ ముగ్గురు హీరోలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. విక్రమ్‌ తనయుడు ధ్రువ్‌ హీరోగా తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ సినిమా తమిళంలో తెరకెక్కించారు బాలా. ఆ సినిమా డిజాస్టర్‌ కావడంతో పాటు చూసిన వారంతా బాలాను తిట్టిపోసుకున్నారు. దీంతో ఇన్నాళ్లూ తన విలక్షణమైన సినిమాలతో సంపాదించుకున్న క్రేజ్ మొత్తం పోయింది.

దీంతో ఈసారి తనకు అచ్చొచ్చిన మల్టీస్టారర్‌తో మంచి హిట్ కొట్టాలని బాలా నిశ్చయించుకున్నారట.
మరోవైపు ‘ఆకాశం నీ హద్దురా’తో సంచలన విజయం తన ఖాతాలో వేసుకున్నాడు సూర్య. ఇక ఈ మల్టీస్టారర్‌లో నటిస్తున్నారన్న ప్రచారంతో కోలీవుడ్ ప్రేక్షకులు చాలా ఆనందంగా ఉన్నారట. ఈ మల్టీ స్టారర్ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట.

మల్టీస్టారర్ చిత్రాల్లో సూర్య కనిపించడంతో కొత్తేమీ కాదు. గతంలో ‘శివపుత్రుడు’లో విక్రమ్‌తో, ‘బందోబస్త్‌’లో మోహన్‌లాల్‌, ఆర్యతో కలిసి నటించారు. ప్రస్తుతం ఆయన మణిరత్నం నిర్మిస్తున్న ‘నవసర’ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ కి  స్టార్ డైరెక్టర్  గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. మరెన్నో మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: