సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ కెరియర్ కాలం చాలా తక్కువ అని చెబుతూ ఉంటారు సినీ విశ్లేషకులు. ఈ మధ్య కాలంలో మాత్రం ఎంతో మంది హీరోయిన్లు... కథానాయికల కెరియర్ కాలం తక్కువ అని ఉన్న భావాలను పటాపంచలు చేస్తూ దాదాపు  దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పటికీ కూడా కొంతమంది హీరోయిన్లు మాత్రం  2, 3 సినిమాలకే పరిమితం అవుతున్నారు. ఇక ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఇక పెళ్లి చేసుకుని సెటిల్ అవుతున్నారు ఎంతో మంది హీరోయిన్లు.



 ఇటీవలే మరో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన కత్తి సినిమాలో  నందమూరి హీరో సరసన నటించిన సనాఖాన్ ప్రేక్షకులను తన అందచందాలతో ఆకర్షించింది అనే విషయం తెలిసిందే. కత్తి సినిమా ఫ్లాప్ కావడంతో ఈ అమ్మడికి అంతగా అవకాశాలు రాలేదు. చాలా రోజుల తర్వాత మంచు మనోజ్ హీరోగా నటించిన మిస్టర్ నూకయ్య అనే సినిమాలో అవకాశం దక్కించుకుంది సనా ఖాన్ . ఈ సినిమా కూడా ఈ అమ్మడికి అంతగా కలిసి రాలేదు.



 ఇక ఆ తర్వాత టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన గగనం సినిమాలో అవకాశం దక్కించుకుంది. సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో ఈ అమ్మడికి అవకాశాలు మొత్తం కరువై పోయాయి. కొన్నాళ్ళ వరకు అవకాశాలకోసం ఎదురు చూసిన ఈ అమ్మడు ఆ తర్వాత సినీ ఇండస్ట్రీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి  అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఇటీవలే పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. సూరత్ కు  చెందిన ముప్తి అనాస్  ను పెళ్లి చేసుకుంది. అత్యంత సన్నిహితులు బంధువుల సమక్షంలో సనా ఖాన్ పెళ్లి జరిగినట్లు తెలుస్తుంది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.  చూసిన అభిమానులు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: