సూపర్ సక్సెస్ అయిన ఆహా కోసం ఇప్పుడు పవన్ సినిమాతో మరింత బూస్టింగ్ ఇవ్వాలని చూస్తున్నరు. పవన్ అనగానే అందరు పవర్ స్టార్ అనుకోవడం ఖాయం కాని ఇక్కడ పవన్ అంటే డైరక్టర్ పవన్ కుమార్. యూటర్న్ సినిమాను డైరెక్ట్ చేసిన పవన్ కుమార్ ఓ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాను తీశాడు. అమలా పాల్ లీడ్ రోల్ లో తెరకెక్కిన ఈ సినిమాను ఆహాలో రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది. యూటర్న్ సినిమా తెలుగులో బాగానే ప్రేక్షకాదరణ పొందింది. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా కూడా అదే తరహాలో మంచి ఫలితాన్ని అందుకుంటుందని చెప్పొచ్చు.
ఇక ఈ సినిమాను త్వరలోనే ఆహాలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. తెలుగు ఆడియెన్స్ ను అమలా పాల్ సుపరిచుతురాలే. చేసింది రెండు సినిమాలే అయినా అమలా తెలుగులో ఓ సగటు హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకుంది. స్ట్రైట్ సినిమాల ఆఫర్ వచ్చినా రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేయడంతో ఆమెను పక్కన పెట్టారు. మరి ఈ సినిమాతో అయినా అమలాకు తెలుగులో మంచి ఆఫర్లు వస్తాయేమో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి