ఇక ఆ తర్వాత మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలతో కొనసాగిన బెల్లంకొండ శ్రీనివాస్ తన ఆకట్టుకునే పర్ఫామెన్స్, డాన్స్, యాక్షన్, ఫైట్ సీన్స్ వంటివాటితో ప్రేక్షకులని ఎంతో అలరించాడు శ్రీనివాస్. ఇక ప్రస్తుతం ఆయన హీరోగా తెరకెక్కుతున్న సినిమా అల్లుడు అదుర్స్. యువ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో భారీ ఖర్చుతో నిర్మితమవుతున్న ఈ సినిమాలో నభానటేష్ హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ ఈ కమర్షియల్ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నాడు. సోనుసూద్ మెయిన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బిగ్ బాస్ 4 ఫేమ్ మోనాల్ గజ్జర్ ఒక స్పెషల్ సాంగ్ చేస్తోంది. ఇక ఈ సినిమా నుండి తొలి సాంగ్ నేడు రిలీజ్ అయి యూట్యూబ్ లో మంచి క్రేజ్ తో కొనసాగుతోంది. ఇక ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని అతి త్వరలో రిలీజ్ కానుండగా మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 15న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.
దీని అనంతరం చత్రపతి మూవీ హిందీ రీమేక్ లో బెల్లంకొండ శ్రీనివాస్ నటించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇటీవల ఒక ప్రముఖ మీడియా ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భాగంగా శ్రీనివాస్ మాట్లాడుతూ హిందీలో తన ఎంట్రీకి చత్రపతి రీమేక్ ఒక మంచి అద్భుతమైన అవకాశం అని ఆ సినిమాలోని చత్రపతి క్యారెక్టర్ ద్వారా తనలోని నటుడిని బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయం చేసి వారి నుండి కూడా మంచి మెప్పు అందుకుంటానని ఆయన ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా ఎంతో భారీ ఖర్చుతో నిర్మితమవుతున్నట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ బాలీవుడ్ నటి ఇందులో సాయి శ్రీనివాస్ కు జోడీగా నటించనున్నట్లు సమాచారం. మొత్తంగా చూస్తుంటే ఈ సినిమా ద్వారా బెల్లం బాబు బాలీవుడ్ కి గట్టి హిట్ తోనే ఎంట్రీ ఇచ్చేటట్టు కనపడతున్నాడని అంటున్నారు విశ్లేకులు.......!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి