అయితే తెలుగులో గ్లామర్ షో అంటే లేదని చెప్పే అనుపమ మళయాళంలో మాత్రం అనుపమ షార్ట్ ఫిలిం లోనే రెచ్చిపోతుంది. ఫ్రీడం ఎట్ మిడ్ నైట్ షార్ట్ ఫిల్మ్ లో అనుపమ తన గ్లామర్ తో అలరిస్తుంది. షార్ట్ ఫిల్మ్ లోనే ఇలా రెచ్చిపోతుంది అంటే ఇక మీదట సినిమాల్లో కూడా అమ్మడు సత్తా చాటుతుందని చెప్పొచ్చు. ఫ్రీడం ఎట్ మిడ్ నైట్ షార్ట్ ఫిలిం ను ఓటిటి లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. తన ఫిజిక్ ఆఫర్లు రాకుండా చేస్తుందని అనుకున్న అనుపమ ఈమధ్య పూర్తిగా బక్కచిక్కిపోయింది.
ఫ్రీడం ఎట్ నైట్ ట్రైలర్ సౌత్ ఆడియెన్స్ ను అలరిస్తుంది. షార్ట్ ఫిలిం కోసం అనుపమ ఇంత రిస్క్ తీసుకుంది అంటే తప్పకుండా ఈ షార్ట్ ఫిలిం లో ఏదో మ్యాటర్ ఉండే ఉంటుందని అంటున్నారు. తప్పకుండా అనుపమ ఈ షార్ట్ ఫిలిం తర్వాత తన ఇమేజ్ మార్చేసుకుంటుందని చెప్పొచ్చు. ఇక తెలుగులో ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. మరి అమ్మడు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి