ఇక లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలో కూడా సముద్రఖనికి ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. అయ్యప్పనుం కోషియం రీమేక్ గా వస్తున్న సినిమాలో పవన్, రానాలతో పాటుగా సముద్రఖని కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. తెలుగులో సముద్రఖని సూపర్ జోష్ కెరియర్ కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు డైరక్టర్ గా ప్రేక్షకులను అలరించిన సముద్రఖని ఇప్పుడు విలన్ గా స్పెషల్ క్యారక్టర్స్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
అంతేకాదు తమిళంలో పెద్దగా అవకాశాలు వచ్చినా రాకున్నా తెలుగులో మాత్రం ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాడు సముద్రఖని. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు తెలుగులో ఆడాయి. ఇక ఇప్పుడు ఆయన నటిస్తున్న పాత్రలతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తున్నారు. పవర్ స్టార్ ఆఫర్ అంటే సముద్రఖని స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నట్టే లెక్క.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి