టాలీవుడ్ స్టార్ హీరోలయిన సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాపవర్ స్టార్ రాం చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా మంచి సూక్స్ లతో కెరీర్ పరంగా దూసుకెళ్తున్నారు. కాగా వీరిలో ప్రస్తుతం మహేష్ బాబు, యువ దర్శకుడు పరశురాం పెట్ల దర్శకత్వంలో సర్కారు వారి పాట మూవీ చేస్తున్నారు. 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు నిరిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఒక ఆర్ధిక నేరాస్తుడిగా నటిస్తున్నట్లు టాక్.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. దీని అనంతరం దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ ఒక భారీ పాన్ ఇండియా సినిమా చేయనున్న విషయం తెలిసిందే. దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కె ఎల్ నారాయణ నిర్మించనున్న ఈ సినిమా భారీ జంగిల్ బేస్డ్ అడ్వెంచరస్ మూవీ గా తెరకెక్కనుందని, అలానే ఈ సినిమా వచ్చే ఏడాది లో సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది. మరోవైపు తొలిసారిగా మెగాపవర్ స్టార్ రాం చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ కల్సి నటిస్తున్న భారీ పాన్ ఇండియా పెట్రియటిక్ మూవీ ఆర్ఆర్ఆర్. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

కాగా ఈ ప్రతిష్టాత్మక సినిమా ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ కానుంది. అయితే దీని తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయనున్న ఎన్టీఆర్, ఆపై మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై కేజీఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్నారు ఎన్టీఆర్. అలానే ప్రస్తుతం ఎన్టీఆర్ తో పాటు ఆర్ఆర్ఆర్ చేస్తున్న రాం చరణ్ ఆపై దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రఖ్యాత దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ పాన్ ఇండియా మూవీ లో నటిస్తున్నారు. మొత్తంగా ఈ ముగ్గురు బడా స్టార్స్ కూడా వరుసగా పాన్ ఇండియా సినిమాలు లైన్లో పెట్టి అతి పెద్ద బాక్సాఫీస్ రికార్డ్స్ పై గట్టిగా గురిపెట్టారు. అయితే ఈ ముగ్గురు స్టార్ హీరోల యొక్క మూవీ ప్లానింగ్ పై పలువురు ప్రేక్షకాభిమానుల స్పందిస్తూ, అబ్బాబ్బాబ్బా ముగ్గురూ ఏమి ప్రాజక్ట్స్ లైన్ లో పెట్టారబ్బా అంటూ వీరిని పొగుడుతూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.......!!

మరింత సమాచారం తెలుసుకోండి: