పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఒక లాయర్ గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్, అనన్య, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తోంది.

దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా నుండి ఇటీవల రిలీజ్ అయిన మగువ మగువ అనే పల్లవితో సాగే లిరికల్ సాంగ్, అలానే ఫస్ట్ లుక్ టీజర్ రెండూ కూడా యూట్యూబ్ లో మంచి వ్యూస్ అందుకుని ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మూవీ పై మరింతగా అంచనాలు పెంచాయి. కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కి మంచి సక్సెస్ అందుకున్న పింక్ మూవీ కి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ వకీల్ సాబ్ ని మంచి మెసేజ్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా యువ దర్శకుడు వేణు శ్రీరామ్ ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు టాక్. 

పవన్ కళ్యాణ్ యాక్షన్, డైలాగ్స్, థమన్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, డైరెక్షన్, హై ప్రొడక్షన్ వాల్యూస్, కథ, కథనం వంటివి ఈ మూవీకి మంచి ప్లస్ పాయింట్స్ గా మారడం ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు టాక్. అయితే అసలు మ్యాటర్ ఏమిటంటే ఈ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని ఈ నెల మూడవ వారంలో రిలీజ్ చేయనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే ట్రైలర్ కట్ కి సంబంధించి వకీల్ సాబ్ యూనిట్ పనులు మొదలెట్టిందని, తప్పకుండా ఈ ట్రైలర్ యూట్యూబ్ రికార్డ్స్ ని బద్దలు కొడుతుందని అంటున్నారు. కాగా ఈ మూవీ వచ్చేనెల 9 న వరల్డ్ వైడ్ గా ఎంతో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: