పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న వకీల్ సాబ్ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన సత్యమేవజయతే సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్, లైక్స్ తో దూసుకెళుతోంది. రామజోగయ్య శాస్త్రి ఎంతో పవర్ఫుల్ గా రాసిన లిరిక్స్ కి యువ మ్యూజికల్ సెన్సేషన్ థమన్ అందించిన ట్యూన్, మరీ ముఖ్యంగా శంకర్ మహదేవన్ గళం ఈ సాంగ్ కి మరింతగా వన్నె తెచ్చాయి.

అంతకముందు ఈ మూవీ నుండి రిలీజ్ అయిన మగువ మగువ సాంగ్, అలానే ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ రెండూ కూడా వకీల్ సాబ్ పై పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో బాగానే అంచనాలు పెంచాయి. పవన్ ఒక పవర్ఫుల్ లాయర్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆయనకు జోడీగా శృతి హాసన్ నటిస్తుండగా అంజలి, నివేదా థామస్, అనన్య, ప్రకాష్ రాజ్, మురళి శర్మ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఇటీవల ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి అయింది. యువ దర్శకుడు శ్రీరామ్ వేణు తీస్తున్న ఈ మూవీ తప్పకుండా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇటీవల బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పింక్ అనే కోర్ట్ డ్రామా మూవీ కి రీమేక్ గా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ స్టోరీ ని మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా దర్శకుడు వేణు శ్రీరామ్ కొన్ని మార్పులు చేసినట్లు సమాచారం. అలానే పవన్ పాత్ర ని ఆయన అభిమానులకు నచ్చే విధంగా రాసుకున్న వేణు, తప్పకుండా వారితో పాటు ఆడియన్స్ కూడా మూవీని ఆదరిస్తారని భావిస్తున్నారట. అన్నిటికంటే ముఖ్యంగా దాదాపుగా మూడేళ్ళ గ్యాప్ తరువాత తమ హీరో నుండి వస్తున్న మూవీ కావడంతో ఈ సారి గురి తప్పేది లేదని, వకీల్ సాబ్ షూర్ షాట్ బ్లాక్ బస్టర్ ఖాయం అని పలువురు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిప్రాయపడుతూ కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: