మాటాల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలలో హేమకు మంచి పాత్రలు చాల రావడమే కాకుండా ఆ పాత్రలు వల్ల ఆమె ఇమేజ్ కూడ పెరిగింది. ముఖ్యంగా హేమ ‘అతడు’ సినిమాలో బ్రహ్మనందం భార్యగా నటించిన సన్నివేశాలలో ఆమె పండించిన కామెడీ ఇప్పటికీ ఆ సినిమా బుల్లితెర పై వస్తున్నప్పుడల్లా అందర్నీ నవ్విస్తుంది. హేమ ఈమధ్య ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పై కొన్ని ఆ శక్తి గల కామెంట్స్ చేసింది. 

‘అతడు’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనను గుర్తుకు చేసుకుంటూ త్రివిక్రమ్ కు స్త్రీల పై ఎంత గౌరవం ఉందో తెలిపే ఆశక్తికర విషయాన్ని ఆఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. ‘అతడు’ షూటింగ్ జరుగుతున్న సందర్భంలో తనకు బ్రహ్మనందానికి మధ్య నడిచే కాఫీ కప్పు సీన్ తో పాటుగా మరొక సీన్ ను కూడా త్రివిక్రమ్ ఆ సినిమా షూటింగ్ సమయంలో ప్లాన్ చేసాడట. 

ఆ సినిమాలో బ్రహ్మనందం ఊరి నుంచి రాగానే తనను పిలుస్తూ బ్రహ్మి కాలుకు ఉన్న షూ ను విసురుగా తన పైకి వచ్చేలా విసిరే సీన్ ను షూట్ చేస్తున్నప్పుడు బ్రహ్మానందం వేగంగా హేమ వైపు విసిరే సరికి ఆ షూ హేమ ముఖానికి వేగంగా వచ్చి గాయం చేసిందట. దానితో హేమ మూతి ఆదెబ్బకు బాగా వాచిపోవడంతో  త్రివిక్రమ్‌ ఆ సీన్ లో జరిగిన పొరపాటుకు బాధపడి ఇంకెప్పుడూ ఆడవాళ్ళను కొట్టే సీన్స్ తన సినిమాలో పెట్టను అని అన్నాడట. అంతేకాదు ఆ సీన్ ను ‘అతడు’ సినిమా నుండి ఫైనల్ ఎడిటింగ్ లో తీసివేసాడట త్రివిక్రమ్.

త్రివిక్రమ్ కు ఇంత సంస్కారవంతమైన భావాలు ఉన్నాయి కాబట్టే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ లో కూడ అల్లుఅర్జున్ చేత ఒక సీన్ లో మన జీవితాలలో జరిగి పొరపాట్లకు, దురదృష్టానికి ఆడవాళ్ళను టార్గెట్ చేయడం మంచిది కాదు అన్న డైలాగ్స్ బన్నీ చేత చెప్పించాడు. ఇన్ని మంచి భావాలు ఉన్నాయి కాబట్టే అందర్నీ సెటైర్లతో కామెంట్ చేసే హేమ త్రివిక్రమ్ ను గౌరవిస్తూ మెచ్చుకోకుండా ఉండలేకపోయింది అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: