టాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఫస్ట్ టైం కలిసి నటిస్తున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా రౌద్రం రుద్రం రుధిరం. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తుండగా కీరవాణి సంగీతాన్ని విజయేంద్రప్రసాద్ కథ ని సాయి మాధవ్ బుర్ర మాటలు అందిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం బాహుబలి 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అత్యద్భుత విజయాన్ని అందుకొని టాలీవుడ్ ఖ్యాతిని హాలీవుడ్ రేంజ్ కి పెంచిన రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడంతో ఆర్.ఆర్.ఆర్ పై మన దేశంతో పాటు ఇతర దేశాల ప్రేక్షకుల్లో కూడా ఆకాశమే హద్దుగా అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇటీవల చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ మాస్టర్ నిక్ పావెల్ ఆధ్వర్యంలో ఎంతో భారీ ఎత్తున ప్రతిష్టాత్మకంగా ఈ సన్నివేశాలను యూనిట్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అలానే దాదాపుగా ఈ క్లైమాక్స్ సీన్ కి రూ. 40 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని యూనిట్ కొన్ని నెలల పాటు ఎంతో శ్రమించి దీనికోసం ఒక ప్రత్యేకమైన సెట్ ని రూపొందించిందని చెబుతున్నారు. 

అందుతున్న సమాచారం ప్రకారం సినిమా మొత్తంలో కూడా ఈ క్లైమాక్స్ సన్నివేశాలు ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తాయని ఒక రకంగా బాహుబలి ని మించే విధంగా ఎంతో అద్భుతంగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ ఇండియన్ హిస్టరీ లోనే ఎప్పటికి నిలిచిపోతుందని సమాచారం. మొత్తంగా రోజురోజుకీ ఎంతో అంచనాలు పెంచుకుంటూ కొనసాగుతున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ రిలీజ్ తర్వాత ఏ రేంజి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి. కాగా ఈ సినిమాని అక్టోబర్ 13న గ్రాండ్ లెవెల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: