తమిళ స్టార్ నటుడు సూర్య సోదరుడైన కార్తి తొలిసారిగా యుగానికి ఒక్కడు సినిమా ద్వారా నటుడిగా సినిమాల్లోకి రంగప్రవేశం చేశారు. అప్పట్లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా తర్వాత లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఆవారా మూవీ ద్వారా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు కార్తి. ఇక అక్కడి నుంచి వరుసగా హీరోగా అవకాశాలు అందుకుంటూ కొనసాగుతున్న కార్తీ ఇటీవల మంచి సక్సెస్ లతో మరింత పాపులారిటీ, క్రేజ్, మార్కెట్ దక్కించుకున్నారు. కొన్నాళ్ల క్రితం కార్తీ హీరోగా తెరకెక్కి రిలీజ్ అయిన ఖైదీ సినిమా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.

ఇటీవల భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో కార్తి హీరోగా తెరకెక్కిన సినిమా సుల్తాన్. రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా యావరేజ్ విజయాన్ని అందుకుంది. మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సుల్తాన్ గా నటించిన కార్తీ పెర్ఫార్మన్స్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అసలు విషయం ఏమిటంటే కార్తి తాజాగా నటిస్తున్న సినిమాకి సర్దార్ అనే టైటిల్ నిర్ణయించారు. పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తుండగా యువ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ దీనికి సాంగ్స్ అందిస్తున్నారు.

మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకునే కథ కథనాలతో ఈ సినిమా రూపొందుతుందని ఇక ఈ సినిమాలో కార్తీక్ ఒక నడి వయస్కుడైన వ్యక్తిగా నటిస్తున్నారని అలానే ఈ సినిమాని కార్తీక్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా దర్శకుడు మిత్రన్ ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని టాక్. తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకొని సూపర్ హిట్ కొడుతుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కి అందరి నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. మరి రేపు రిలీజ్ తర్వాత ఈ సినిమా కార్తీకి ఏ స్థాయి విజయాన్ని అందిస్తుందో తెలియాలంటే కొన్నాళ్లు వరకు వెయిట్ చేయక తప్పదు..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: