నందమూరి వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఈ రోజు..మే20 వ తేదీ2021 నాటికి తారక్ 38 వ పడిలోకి అడుగుపెట్టారు.. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అలాగే ఎన్టీఆర్ అత్త బిజెపి మహిళా నేత పురంధేశ్వరి కూడా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా.. మీరు చాలా ప్రత్యేకమైన వారు. అందుకే మీ మనోహరమైన ముఖం ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలి. హ్యాపీ బర్త్ డే రాక్ స్టార్ అంటూ ట్వీట్ చేశారు పురందేశ్వరి.ఇంకా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు అంతా కూడా సోషల్ మీడియాలో మొన్నటినుంచి హంగామా స్టార్ట్ చేశారు.

ఇక నిన్నటి నుంచి హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్ అంటూ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.కాగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా పుట్టినరోజు వేడుకలు జరుపవద్దని ఎన్టీఆర్ ఓ ప్రకటనను విడుదల చేశారు..కరోనా లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయకపోవడమే మీరు నాకిచ్చే పుట్టినరోజు కానుకగా భావిస్తానని ఆ ప్రకటనలో పేర్కొన్నారు తారక్.. ఇక ఇదిలావుంటే ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఓ సరికొత్త పోస్టర్‌తో యంగ్‌ టైగర్‌ అభిమానుల్ని మరోసారి ఫిదా చేసింది rrr టీమ్‌. 'ఆర్‌ఆర్‌ఆర్‌' నుంచి ఓ సరికొత్త లుక్‌ను నెట్టింట్లో షేర్‌ చేసింది.

 ఇందులో ఎన్టీఆర్‌ పవర్‌ఫుల్‌గా కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ సినీ ప్రియుల్ని ఎంతగానో ఆకర్షిస్తోంది.యాక్షన్‌, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో రామ్‌చరణ్‌ మరో కథానాయకుడిగా కనిపించనున్నారు.ఈ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్‌ను రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. సుమారు రూ.450 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య 'ఆర్‌ఆర్‌ఆర్‌' నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌, రామ్‌చరణ్‌కు జంటగా బాలీవుడ్‌ భామ ఆలియాభట్‌ సందడి చేయనున్నారు.అక్టోబర్ 13 దసరా కానుకగా ఈ సినిమా విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: