దేశంలోని అద్భుత నటుల్లో మోహన్ లాల్ పేరు కచ్చితంగా ఉంటుంది. మోహన్‌లాల్ ఎప్పటికప్పుడు సరికొత్త కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా ప్రతి పాత్రలోనూ పరకాయ ప్రవేశం చేసినట్లు నటిస్తాడు. అతడు చేసే ప్రతి సినిమాలోనూ ఆ పాత్రే కనిపిస్తుంది. కానీ ఎక్కడా కూడా మోహన్‌లాల్ ఆ పాత్రలా చేస్తున్నాడు అన్న భావన ప్రేక్షకులకు కలగకుండా చేస్తాడు. ఎటువంటి పాత్ర అయినా దానికి ప్రాణం పోస్తాడు. అయితే మోహన్ లాల్ తన 18 ఏళ్ల వయసులో సినీ రంగ ప్రవేశం చేశాడు. 1978లో వచ్చిన ‘తిరనోత్తమ్’ అనే మలయాళం సినిమాతో సినిమాల్లోకి అరంగేట్రం చేశాడు. కానీ ఈ సినిమా విడుదల కావడానికి దాదాపు 25 ఏళ్లు ఆలస్యం అయింది. ఇంతలో మోహన్ లాల్ స్టార్ హోదాను అందుకున్నాడు.


అయితే మోహన్‌లాల్ తాజాగా నటించిన సినిమా దృశ్యం2. ఈ సినిమా మొదటి భాగం వచ్చిన ఏడు సంవత్సరాల తరువాత రెండవ భాగం వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో మోహన్‌లాల్ అద్భుతమైన నటనను కనబరిచారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్ లాల్ తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను తెలిపారు. ఇందులో భాగంగా తాను ఇప్పటి వరకు దాదాపు 340 సినిమాల్లో నటించానని కూడా చెప్పాడు. అయితే మలయాళంలో ఎన్నో రికార్డులు సృష్టించిన నటుడిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారని అడగడంతో.. ‘నేను ఎప్పుడూ సినిమా ఎంత విజయం సాధిస్తుందని ఆలోచించను. కథ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఆ విధంగానే నేను చేసిన సినిమాలు రికార్డులు సృష్టించాయ’ని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తాను ఎప్పుడు నటనను ఓ ఉద్యోగంలా అనుకోలేదని చెప్పాడు. ఎప్పుడైతే తనకు నటించడం ఓ ఉద్యోగంలా అనిపిస్తుందో ఆ క్షణం తాను నటించడం మానేస్తానని అన్నాడు.



అంతేకాకుండా తాను ప్రతి పాత్రను ఆ పాత్రలాగానే చేయాలని అనుకుంటానని, ఓ పాత్ర గురించి చదివినప్పుడు ఆ పాత్ర ఎలా ఉందనేది మనకు ఓ ఐడియా వస్తుందని, ఆ ప్రకారమే ప్రతి పాత్రలో నటిస్తానని అన్నారు. మన నటనపై మనతో కలిసి చేసేవారు కూడా ప్రభావం చూపుతారని, దృశ్యం2లో తనకు అటువంటి ఇబ్బంది లేదని, తన భార్యగా చేసిన మీనా అద్భుతంగా నటించారని, అదే విధంగా తన పిల్లలుగా చేసిన వాళ్ళ కూడా బాగా చేశారని చెప్పుకొచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: