కళా తపస్వి అని ఆయన్ని ఊరికే అనలేదు. ఆయన ప్రతీ సినిమాను అంత అందంగా తీస్తారు. ఇక ఆయన సినిమాల్లో పాత్రలే కాదు పాటలు కూడా పది కాలల పాటు గుర్తుండిపోతాయి. విశ్వనాధ్ కి సంగీతం మీద మక్కువ ఎక్కువ. అందుకే దగ్గర ఉండి అన్ని పాటలు బాగా వచ్చేలా చూసుకుంటారు.

ఆయన శంకరాభరణం తరువాత మెచ్చి తీసిన మరో కళాఖండం సాగర సంగమం. ఈ మూవీలో నాద వినోదం నాట్య విలాసం అన్న పల్లవితో వచ్చే సాంగ్ ఉంది. ఈ సాంగ్  చాలా పెద్దది. రెండవ చరణంలో కిన్నెర సాని వచ్చేనమ్మ వెన్నెల పైటేసి అంటూ కొనసాగినంపుగా అందమైన భావనతో సాహిత్యం, సంగీతం సాగుతాయి. ఈ సాంగ్ ని కమల్ హాసన్ జయప్రదల మీద విశ్వనాధ్ చిత్రీకరించారు. అయితే కిన్నెరసాని అంటూ వచ్చే అనుబంధ గీతాన్ని మాత్రం చిత్రీకరించలేదు. దానికి కారణం తెలియదు కానీ మొత్తానికి విశ్వనాధ్  మెచ్చి మోజుపడి చేయించుకున పాటలో కొంత భాగం అలా ఉండిపోయింది.

అయితే దీని మీద మక్కువ పెంచుకున్న లేడీస్ టైలర్, మంచుపల్లకి వంటి చిత్రాల డైరెక్టర్ వంశీ తన సితార సినిమాలో చక్కగా  వాడుకున్నారు. ఈ మూవీని కూడా పూర్ణోదయ బ్యానర్ మీద తీయడంతో ఏ ఇబ్బంది లేకుండా పోయింది. ఈ మూవీలో  సుమన్, భానుప్రియ హీరోహీరోయిన్లు. వారి మీద ఈ సాంగ్ ని గోదావరి గలగలల మధ్య వంశీ అద్భుతంగా చిత్రీకరించి ఈ పాటకు పూర్తి న్యాయం చేశారనే చెప్పాలి. వేటూరి గీతానికి ఇళయరాజా బాణీలు సమకూర్చిన ఈ గీతం అలా ఒక కళాతపస్వి మూవీ నుంచి మిస్ అయినా మరో మంచి సినిమాలో చోటు సంపాదించుకోవడం విశేషమే. ఇక్కడ చెప్పుకోవాలంటే రెండు సినిమాలూ మ్యూజికల్ హిట్లుగా ఉన్నాయి. ఈ రోజుకీ విశేష జనాభిమానాన్ని చూరగొంటూనే ఉన్నాయి. అదే కిన్నెరసాని గొప్పతనం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: