బాలీవుడ్ నటుడు
అక్షయ్ కుమార్ జూన్ 5వ తేదీన తన ఇన్ స్టాగ్రామ్/ట్విట్టర్ వేదికగా కరోనాను జయించేందుకు 5 చిట్కాలను వీడియో రూపంలో పోస్ట్ చేశారు. కరోనా లక్షణాలు ఉన్నా.. కరోనా బారిన పడినట్టు నిర్ధారణ అయినా.. తాము చెప్పబోయే 5 చిట్కాలను ప్రజలు పాటించాలంటూ ఆయన చెప్పారు. ఈ వీడియో లో
అక్షయ్ కుమార్ తో పాటు సైయ్యాన్, సాధ్వని అనే ఇద్దరు చిన్నారులు కనిపించి జాగ్రత్తలను తెలియజేశారు. కరోనా ని అంతమొందించేందుకు ప్రారంభించిన ఓ
మీడియా అవేర్నెస్ క్యాంపెయిన్ లో భాగంగా
అక్షయ్ కుమార్ ఈ వీడియోని తన అభిమానులతో పంచుకున్నారు.
"ఈ కరోనా మహమ్మారితో పోరాడటానికి టీకా తర్వాత కూడా తప్పనిసరి అయిన ముఖ్యమైన చిట్కాలను షేర్ చేస్తున్నాం. దయచేసి చూడండి," అని
అశోక్ కుమార్ ఈ వీడియో కి ఒక క్యాప్షన్ జోడించారు.
ఈ వీడియోలో చిన్నారులు చెప్పిన 5 చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. "కరోనా లక్షణాలు కనిపిస్తే మాస్కు ధరించి
హోమ్ ఐసోలేషన్ లోకి 10 రోజుల వరకు వెళ్ళిపోవాలి. లక్షణాలు విపరీతంగా పెరిగితే
డాక్టర్ సలహా తీసుకోవాలి. లక్షణాలు ఉన్నప్పుడు చాలా పరిశుభ్రంగా ఉంటూ ఇతరులకు చాలా దూరంగా ఉండాలి. లక్షణాలు ఉన్న వ్యక్తికి ఆహారం అందించే కుటుంబ సభ్యులు సైతం చాలా జాగ్రత్తలు పాటిస్తూ మాస్కు ధరించాలి. హ్యాండ్ శానిటైజర్ వాడాలి. ఆక్సిమీటర్ తో
ఆక్సిజన్ స్థాయిలను తరచూ పరిశీలిస్తూ..
ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గితే వెంటనే
డాక్టర్ ని ఆశ్రయించాలి" అని జాగ్రత్తలు చెప్పారు. ఈ వీడియో చివరి లో అక్షయ్ కుమార్.. "ప్రతి ఇల్లు కరోనాను ఓడించాలని నిశ్చయించుకుంది" అని చెప్పారు.
ఇకపోతే ఈ వీడియోకి ఇప్పటికే 9 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఆక్సిజన్ సిలిండర్ లను ఉచితంగా అవసరమైన వారికి పంపిణీ చేసేందుకు ట్వింకిల్ ఖన్నా,
అక్షయ్ కుమార్ కలిసి కోటి రూపాయల వరకు విరాళాలు సేకరించారు.