టాలీవుడ్ లో
ప్రభాస్ క్రేజ్ ఏ విధంగా పెరిగిపోయిందో అందరికీ తెలిసిందే.
బాహుబలి,
బాహుబలి 2 హిట్ లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ
సినిమా తరువాత
ప్రభాస్ క్రేజ్
టాలీవుడ్ కే కాకుండా దేశమంతటా విస్తరించింది. ఒక్క సినిమాతోనే
ప్రభాస్ ఈ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకోవడం అంటే మాటలు విషయం కాదు. ఆయన ఈ రేంజ్ కు రావడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే. బహుబలి
సినిమా కోసం ఆయన కెరీర్ మొత్తం అన్ని సినిమాలకు పడ్డ కష్టాన్ని ఒక్క సినిమాకి పడి ఇప్పుడు ఈ స్టార్ ఎంజాయ్ చేస్తున్నాడు.
ఇక
ప్రభాస్ కి ఉన్న ఫాలోయింగ్ ని సొమ్ము చేసుకోవాలని ఎన్నో కంపెనీలు భావించగా
ప్రభాస్ వాటి పట్ల ఆసక్తి కనబరుకాలేదు. వారి ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో ఆయా కంపెనీలు వెనక్కి తగ్గాయి. ఈ క్రమంలో మన
బాహుబలి స్టార్ సుమారు 150 కోట్ల రూపాయల విలువ చేసే బ్రాండ్స్ నువ్వు వదులుకున్న ట్లు నెట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ప్రభాస్ కి ఉన్న స్టార్ స్టేటస్ ని దృష్టిలో పెట్టుకొని ఆయన్ని తమ బ్రాండ్ అంబాసిడర్ గా చేసుకోవాలని కొన్ని వ్యాపార సంస్థలు భావించాయట భారీ పారితోషికం ఆఫర్ చేస్తూ
ప్రభాస్ ను సంప్రదించారట.
వరస
సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో పాటు ప్రేక్షకుల్లో తన అభిమానాన్ని దృష్టిలో ఉంచుకొని వచ్చిన బ్రాండ్స్ అన్నిటినీ ఓకే చేయకూడదని నిర్ణయచుకున్నారు. ఆ ఉద్దేశంతోనే ఆయన సున్నితంగా తిరస్కరించారని వార్తలు ప్రచారం అవుతున్నాయి. ప్రభాస్ కు
భారత్ లోనే కాకుండా విదేశాల్లో సైతం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాంతో ఆయనతో యాడ్ చేస్తే ప్రపంచమంతటా వారి ప్రొడక్ట్ ప్రమోట్ అవుతుందని వారి ఆలోచన. దీనిని రిజెక్ట్ చేయడం వల్ల గడచిన ఏడాది సుమారు 150 కోట్ల రూపాయలు విలువ చేసే కాంట్రాక్టులు ఆయన వదులుకున్న ట్లు సమాచారం.