తెలుగునాట కార్తీక దీపం సీరియల్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమాలను సైతం మించిపోయే క్రేజ్ ను దక్కించుకుంటుంది ఈ సీరియల్. టిఆర్పి రేటింగ్ నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో గతంలో ఏ సీరియల్ దక్కించుకొని రీతిలో ఈ సీరియల్ కి దక్కుతుంది. అంతేకాదు ఆదరణ విషయంలో కూడా ఈ సీరియల్ కు ఎక్కువగా మార్కులు పడుతున్నాయి. ఈ సీరియల్ క్రేజ్ ఈ రేంజ్ లో ఉంది అంటే గృహిణులు అందరూ ఈ సీరియల్ వచ్చే టైం కు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తూ ఉంటారు. ఈమధ్య హాట్ స్టార్ లో కూడా ఈ సీరియల్ వీక్షిస్తూ అలరింపబడుతున్నారు వీక్షకులు.
రెండు మూడు సార్లు ఒక
ఎపిసోడ్ ని చూడడం అలవాటు అయ్యింది దాంతో దీనిలోని ఎమోషన్ ఎంత గా వారిని ఆకట్టుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సీరియల్ లోని నటీనటులకు వచ్చిన క్రేజ్
సినిమా స్టార్ ల కు ఉన్న క్రేజ్ తో సమానంగా ఉంది. ముఖ్యంగా ఈ సీరియల్ లో
హీరోయిన్ పాత్ర పోషిస్తున్న నటీమణి ప్రేమి విశ్వనాథ్ కి స్టార్
హీరోయిన్ కి ఉన్న పాపులారిటీ ఉంది. అందరూ ఈమె గురించి అందరూ వెతకడం మొదలు పెట్టడంతో ఆమెకు ఏ రేంజ్ లో ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు.
మలయాళ నటి అయినా ప్రేమి విశ్వనాథ్ కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క గా తన నటనతో అందరినీ మెప్పిస్తుంది. ఈమె సీరియల్ జీవితం అందరికీ తెలిసినదే అయినా వ్యక్తిగత జీవితం చాలా తక్కువ మందికి తెలుసు. ప్రముఖ ఆస్ట్రాలజర్ ని ప్రేమించి
పెళ్లి చేసుకున్న ఈమెకు ఓ బాబు ఉన్నాడు అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ బాబు ప్రస్తుతం తన తల్లి దగ్గర ఉంటున్నాడని వారి ఆలనా పాలనా ఆమె చూసుకుంటుందని తెలిపింది. ఫ్యామిలీ కోసం ఒక వారం
హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకొని మరొక వారం కేరళలో గడుపుతుంటాను అని ప్రేమి తెలిపింది. ఇక తన
భర్త తరచుగా ఇంట్లో ఉండరని టూర్ లకు వెళుతుంటాడు అని వివరించింది.