నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం కొంత లో గా ఉందని చెప్పవచ్చు. ఆయన నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో నాని గతంలో ఉన్న స్టార్ స్టేటస్ ఇప్పుడు పొందలేకపోతున్నాడు. ఆయన గత చిత్రం వి ఫ్లాప్ అవ్వడం ఆయనపై ఎక్కువ ప్రభావం చూపింది.  దానికి తోడు ఆ సినిమా థియేటర్ లో కాకుండా ఓ టీ టీ లో విడుదలవడం నాని కి పెద్ద మైనస్ గా మారింది. ఇకపోతే నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ అనే సినిమా చేస్తున్నాడు.  కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తుండగా జగపతిబాబు కీలక పాత్రలో నటించాడు.

కరోనా కారణం గా ఈ సినిమా వాయిదా పడింది కానీ అన్ని సరిగ్గా ఉంటే ఎప్పుడో రిలీజ్ అయ్యేది. గతంలో శివ నిర్వాణ కాంబినేషన్ లో నాని నిన్ను కోరి అనే సినిమాసినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. వీరి కాంబినేషన్ లో వస్తున్న రెండవ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే దర్శకుడిగా శివ చేసిన మూడో సినిమా ఇది. దీంతో హిట్ కొట్టి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. రెండవ సినిమా అక్కినేని నాగచైతన్య తో చేసిన మజిలీ కూడా హిట్ అయ్యింది. 

అయితే నాని తన గత చిత్రం వి సినిమా విషయం లో చేసిన తప్పే ఇప్పుడు టక్ జగదీష్ కి కూడా చేస్తున్నారని చెబుతున్నారు సినీ విశ్లేషకులు. వి చిత్రం విడుదల అవడానికి ఎప్పుడో సిద్ధం కాగా నాన్చి నాన్చి దానిపై ఇంట్రెస్ట్ పోయేలా చేశారు నాని. ఇప్పుడు జగదీష్ కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నా రిలీజ్ చేయకుండా దానికి ఉన్న బజ్ పోయేలా చేస్తున్నాడు.   మొదట్లోనే వి విడుదలై ఉంటే హిట్ గా నిలిచేదేమో. ఇప్పుడు కూడా అలా చేయకుండా తప్పు చేస్తున్నారని అంటున్నారు. ఈ సినిమా తరువాత నాని శ్యామ్ సింగ రాయ్ ,  అంటే సుందరానికి అనే సినిమా లను లైన్ లో పెట్టాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: