రిలీజైన మేకింగ్ వీడియోలో సినిమాపై అంచనాలు డబుల్ అయ్యేలా చేసిన జక్కన్న అసలు విషయాలను మాత్రం దాచి పెట్టాడు. సినిమాలో ఎన్.టి.ఆర్ కొమరం భీం పాత్రలో.. అల్లూరి సీతారామ రాజు పాత్రలో రాం చరణ్ నటిస్తున్నారన్న విషయం తెలిసిందే కదా అయినా సరే మేకింగ్ వీడియోలో ఆ గెటప్ లో ఉన్న స్టిల్స్ కాని సీన్ కాని చూపించలేదు. చరణ్, ఎన్.టి.ఆర్ లను చూపించినా ఫైట్ సీన్ మాత్రమే ఇంటెన్స్ లుక్ తో ఉన్న స్టిల్స్ మాత్రమే చూపించారు. అయితే సినిమాలో వారి ఒరిజినల్ స్టిల్స్ కోసం మరో ప్రత్యేకమైన టీజర్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ నుండి రామరాజు.. కొమరం భీం టీజర్ లు వచ్చాయి. అయితే ఈ మేకింగ్ వీడియోలో ఆ స్టిల్స్ కు సంబందించిన క్లిప్స్ మాత్రం యాడ్ చేయలేదు. అయితే సినిమాలో రిలీజ్ ఎప్పుడా అనుకున్నా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పి సర్ ప్రైజ్ చేశాడు జక్కన్న. ముందు అనుకున్న డేట్ అక్టోబర్ 13నే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ చేస్తారని చెప్పారు. మరి జక్కన్న చేసే అద్భుతాలు ఎలా ఉంటాయో చూడాలంటే మరో 3 నెలలు వెయిట్ చేయాల్సిందే. డివివి దానయ్య 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాను వరల్డ్ వైడ్ గా భారీ రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి