సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని బంధాలు విచిత్రంగా ఉంటాయి. పెళ్లి అయినా కూడా సదరు హీరోయిన్ గాని హీరో గాని మరో పెళ్లి చేసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడరు.  హీరో కి పెళ్లి అయినది అని తెలిసి కూడా హీరోయిన్ పెళ్లి చేసుకుంటూ తమ మధ్య విచిత్రమైన బంధాన్ని ఏర్పరచుకొని తన ప్రేమను ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ విచిత్రమైన అనుబంధాలు తగ్గాయి కానీ ఒకప్పుడు హీరోలు హీరోయిన్ లు వెరైటీ వెరైటీ గా ప్రేమించుకునే వారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం జి ఆర్ కు ముగ్గురు భార్యలు అన్న విషయం అందరికీ తెలిసిందే.

ఆయన చనిపోయాక మూడు వారాల పాటు తమిళనాడు సీఎం బాధ్యతలు నిర్వహించింది ఆయన భార్య జానకి. 1987లో ఆయన స్వర్గస్తులవగా ఆయన సతీమణి జానకి 1996 లో కన్నుమూసింది. ఎంజీఆర్ కు ఈమె మూడో భార్య అని చాలామందికి తెలుసు కానీ ఆమెకు ఎంజీఆర్ రెండవ భర్త అని చాలా తక్కువ మందికి తెలుసు. ఈమె అసలు పేరు కూడా జానకి కాదు నారాయణీయమ్మ జానకి. 1923లో కేరళలోని ఓ తమిళనాడు కుటుంబంలో జన్మించింది. తన తండ్రి సినీగేయ రచయితగా పనిచేశాడు. అప్పటినుంచి సినిమాలు అంటే ఇష్టం ఉండేది ఆమెకు. 

సినిమాలలో నటించాలనే కోరికతో మద్రాసు వచ్చి నవాబ్ రాజ మాణిక్యం నాటక సంస్థ నిర్మించిన ఇవ్వ సాగరం సినిమాలో నటించే అవకాశం అందుకుంది.  అప్పటికి ఆమె వయసు 13 సంవత్సరాలే. అయితే అనుకోకుండా జరిగిన అగ్ని ప్రమాదంలో సినిమా రీల్లు కాలిపోవడంతో ఆమె మరో అవకాశం కోసం ఎదురు చూసింది. కృష్ణన్ తూడు అనే సినిమాలో అవకాశం రాగా ప్రగతి స్టేడియంలో మేకప్ మెన్ గా ఉన్న గణపతి భట్ ను వివాహం చేసుకుంది జానకి.  వారికి ఓ బాబు పుట్టాడు. పెళ్లి తర్వాత కూడా సినిమాలను చేసింది జానకి.  ఆ సమయంలోనే ఎంజీఆర్ తో పరిచయం ఏర్పడింది. అప్పుడే వారి పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలం తర్వాత రెండో భార్య చనిపోవడంతో ఎంజీఆర్ జానకి నీ వివాహం చేసుకోగా, మొదటి భర్తతో విడిపోయింది జానకి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

MGR