
ఆగస్టు 22వ తేదీన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో ఆయనకు సంబంధించిన సినిమాల అప్డేట్లు ను విడుదల చేయడానికి ఆ చిత్ర దర్శకులు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం చిరు నాలుగు సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో ఆచార్య సినిమా త్వరలో విడుదల కాబోతుంది. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదల తేదీని కూడా ఈ సందర్భంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.
ఇక మోహన్ రాజా దర్శకత్వంలోని గాడ్ ఫాదర్ సినిమా కి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ను వెల్లడిస్తారని భావిస్తున్నారు మెగా అభిమానులు. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వేదాలం సినిమా అప్డేట్ ను, బాబీ దర్శకత్వంలోనీ తెరకెక్కుతున్న సినిమా అప్డేట్ ను ఆ రోజున తప్పకుండా వెల్లడిస్తారని భావిస్తున్నారు ప్రేక్షకులు. దీంతో ఒకే రోజున నాలుగు సర్ప్రైజ్ లతో పండగ చేసుకోవచ్చని భావిస్తున్నారు ప్రేక్షకులు. అంతేకాకుండా ఆయన వారసురాలు సుస్మిత నుంచి కూడా ఆరోజు ఓ సర్ప్రైజ్ రాబోతున్నట్లు తెలుస్తుంది.
కాస్ట్యూమ్ డిజైనర్ గా పలు సినిమా లకు పని చేసి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది సుస్మిత. ఇటీవల చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది. అంతే కకుండా ఆమె భర్త విష్ణుప్రసాద్ తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే ఓ ప్రొడక్షన్ హౌస్ ను కూడా లాంచ్ చేసింది. ఇప్పటికే ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఓ వెబ్ సిరీస్ ను చేస్తున్న ఆమె మరొక వెబ్ సిరీస్ ను కూడా చిరంజీవి పుట్టిన రోజున చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ టీజర్ ను కూడా విడుదల చేసింది. మరి చిరంజీవి ప్రేక్షకుల కోసం అదిరిపోయే సర్ప్రైజ్ ను ప్లాన్ చేసిన సుష్మిత ఏ రేంజ్ లో ఈ సర్ప్రైజ్ ను ప్రేక్షకులకు అందిస్తుందో చూడాలి.