సూపర్ స్టార్ కృష్ణ వారసుడుగా టాలీవుడ్ ను షేక్ చేస్తున్న మహేష్ కు అన్నయ్య ఉన్నాడు అన్నవిషయం ఈనాటి తరానికి చాలామందికి తెలియదు. మహేష్ అన్నయ్య రమేష్ బాబు కూడ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. దాసరి నారాయణరావు ‘నీడ’ మూవీలో కీలకపాత్రలో నటించిన అతడిని చూసి అప్పట్లో చాలామంది కృష్ణ వారసుడుగా రమేష్ ఫిలిం ఇండస్ట్రీని ఏలుతాడు అనుకున్నారు.



దీనికి తగ్గట్టుగానే అప్పటితరం టాప్ దర్శకులు అందరితోను రమేష్ హీరోగా సినిమాలు చేసాడు. కృష్ణ సొంత నిర్మాణసంస్థ పద్మాలయ తరఫున అనేక సినిమాలు రమేష్ ను హీరోగా చేసి తీసారు. కొన్ని సినిమాలలో సూపర్ స్టార్ కృష్ణ కూడ రమేష్ తో కలిసి నటించాడు.


అయితే ఆప్రయోగాలు అన్నీ ఘోరమైన ఫ్లాప్ లుగా మారాయి. ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణ రమేష్ కెరియర్ గురించి స్పందిస్తూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. తన పెద్ద కొడుకు రమేష్ బాబు మంచి నటుడిగా మంచి పరిణితి చెందినప్పటికీ అతడికి సరైన సినిమాలు రాకపోవడంతో కమర్షియల్ హీరోగా గుర్తింపు దక్కించుకోలేక పోయాడు అని కామెంట్స్ చేసాడు. కమర్షియల్ గా సక్సస్ లు లేకపోవడంతో సినిమాల పై రమేష్ బాబుకు ఆశక్తి తగ్గింది అంటూ కృష్ణ అప్పటి విషయాలను గుర్తుకు చేసుకున్నాడు.  


అయితే రమేష్ బాబు మరికొంత కాలం ప్రయత్నించి ఉంటే బాగుండేది అనేది అప్పట్లో చాలామంది చెప్పినా అతడు వినలేదు అంటూ కామెంట్స్ చేసాడు. వాస్తవానికి ఒకనాటి హీరోలు చాలమంది ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్న పరిస్థితులలో రమేష్ కూడ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారవచ్చని అయితే అలాంటి పాత్రలు చేసే ఉద్దేశ్యం తన పెద్దకొడుకు కు లేదు అని అంటున్నాడు. గతంలో రమేష్ నిర్మాతగా మారి మహేష్ తో రెండు భారీసినిమాలు తీసాడు. అయితే ఆరెండు సినిమాలు పరాజయం చెందడంతో తన నిర్మాణ సంస్థ కార్యకలాపాలు కూడ తగ్గించాడు. రమేష్ పెద్ద కొడుకు మాత్రం అచ్చు సూపర్ స్టార్ కృష్ణ మహేష్ ల పోలికతో కనిపిస్తూ ప్రస్తుతం ఉన్నత చదువులు చదువుతున్నాడు. భవిష్యత్ లో ఇతడు కూడ హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: